ఆగని యువతుల స్మగ్లింగ్
కాగా, ఆసియా అభివృద్ధి బ్యాంక్ (ఎడిబి) అంచనా ప్రకారం, లక్ష మంది నుంచి రెండు లక్షల మంది వరకు నేపాలీ మహిళలు, యువతులు భారతదేశంలోని వ్యభిచార గృహాలలో మగ్గుతున్నారు. వారిలో సుమారు 25 శాతం మంది 18 ఏళ్ళలోపు వారే.
'దాదాపు 70 వేల మంది నేపాలీ మహిళా వలస కూలీలు వివిధ దేశాలలో లేబర్ మార్కెట్లలో పని చేస్తున్నారు. సాలీనా నేపాల్ కు సుమారు 1.5 బిలియన్ డాలర్లు (రూ. 7200 కోట్లు) మేర విదేశీ మారక ద్రవ్యం లభిస్తుంటుంది. మహిళా వలస కూలీలు పంపిన మొత్తాలు అందులో దాదాపు 11 శాతం మేరకు ఉంటాయి. నేపాల్ దేశపు జిడిపి (స్థూల జాతీయోత్పత్తి)లో 17 శాతం పైగా ఈ చెల్లింపులు ఉంటాయి' అని నేపాల్ లో ప్రభుత్వేతర స్వచ్ఛంద సంస్థ (ఎన్ జిఒ) మైతీ ఇటీవల నిర్వహించిన ఒక అధ్యయనంలో వెల్లడైంది.
అటువంటి యువతులలో వ్యభిచార వృత్తిలోకి బలవంతంగా వెళుతున్నవారు చెప్పుకోదగిన సంఖ్యలోనే ఉంటారని మైతీ అంచనా. 'గతంలో యువతులను భారతీయ వ్యభిచార గృహాలకు విక్రయించేవారు. కాని ఇప్పుడు వారిని గల్ఫ్ కు పంపుతున్నారు. వారిని గల్ఫ్ నుంచి ఇక్కడికి తిరిగి తీసుకురావడం దాదాపు అసాధ్యం' అని మైతీ ప్రాంతీయ మేనేజర్ ప్రభా ఖనల్ చెప్పారు.
మైతీ సంస్థ ఈ సంవత్సరం ఆగస్టులో 13 మంది యువతులను రక్షించింది. వారిలో ఆరుగురిని ముంబై సమీపంలోని కల్యాణ్ రైల్వే స్టేషన్ లో నిలిపివేశారు. మరి నలుగురిని ముంబై సహర్ అంతర్జాతీయ విమానాశ్రయంలోను, ఇంకా ముగ్గురిని ముంబైలోని ఒక వ్యభిచార గృహంలో నుంచి రక్షించారు.
దవ భూతి తమంగ్ షెర్పా (21)ని లెబనాన్ కు పంపారు. ఆమెను తిరిగి తీసుకువచ్చిన తరువాత నేపాల్ కు చెందిన త్రిభువన్ అంతర్జాతీయ విమానాశ్రయ మెట్రోపాలిటన్ పోలీసులు మైతీకి అప్పగించారు. ఆమెకు ఒక కన్ను కనిపించదు.ఆమె చేతులు కమిలిపోయి ఉన్నాయి. ముందు వాగ్దానం చేసినట్లుగా ఆమెకు నెలకు 150 డాలర్లు (రూ. 7200) డబ్బు కూడా అందలేదు. ఆమెన క్లయంట్లు శారీరక హింసలకు గురి చేసారనేందుకు గుర్తులు స్పష్టంగా కనిపిస్తున్నాయి.
Pages: -1- 2 -3- News Posted: 29 October, 2009
|