ఆగని యువతుల స్మగ్లింగ్
మరొక యువతి పద్మా దరై (23)ని సౌదీ అరేబియా నుంచి దాదాపు మతి భ్రమించిన స్థితిలో తిరిగి తీసుకువచ్చారు. 'ఇక ఆ యువతుల వల్ల ప్రయోజనం ఉండదని తేల్చుకున్న తరువాత వారిని నేపాల్ కు తిప్పి పంపుతున్నారు' అని ఖనల్ చెప్పారు.
రేవతి (పేరు మార్చడమైనది) అనే యువతి ముంబైలోని ఒక వ్యభిచార గృహం నుంచి తాను తప్పించుకుని బయటపడిన అనుభవాన్ని అశ్రుపూరిత నయనాలతో వివరించింది. 'అక్కడ జీవితం దుర్భరం. మేము రోజుకు ఐదుగురు కస్టమర్లకు సేవలు అందించవలసి ఉంటుంది. ఒక్కొక్క కస్టమర్ నుంచి రూ.150, రూ. 500 మధ్య చెల్లింపు జరుగుతుంటుంది. కాని వ్యభిచార గృహం యజమాని ఆ డబ్బును చేజిక్కించుకుంటుంటారు. మేము టిప్ (బక్షీ)లతో జీవిస్తుంటాం. ఇవి రూ. 5 నుంచి రూ. 25 వరకు ఉంటుంటాయి' అని ఆమె చెప్పింది.
వలస వెళ్ళకుండా యువతులకు కౌన్సెలింగ్ నిర్వహించేందుకు పలు ఎన్ జిఒ సంస్థలు భారత - నేపాల్ సరిహద్దులో అనేక ప్రధాన కూడళ్ళలో కౌంటర్లు ఏర్పాటు చేశాయి. యువతుల అక్రమ రవాణాను ఒక కంట కనిపెట్టేందుకు మధ్య యుపిలోని బహ్రెయిచ్ వద్ద, తూర్పు యుపిలోని మహారాజ్ గంజ్ వద్ద రెండు ప్రధాన సరిహద్దు కూడళ్ళ సమీపంలో వాలంటీర్లు కూర్చుంటారు. ఈ అక్రమ వ్యాపారులు, వీరి ఏజెంట్ల బారిన పడకుండా యువతులను రక్షించేందుకు నేపాల్ లో వాలంటీర్లు చైతన్య కార్యక్రమాలను కూడా నిర్వహిస్తున్నారు.
ఈ బెడదను అరికట్టేందుకు నేపాల్ లోని ఎన్ జిఒ సంస్థలు ఇప్పుడు ఇండియాలోని ఎన్ జిఒ సంస్థలతో సమన్వయంతో కృషి చేస్తున్నాయి. 'దళారులు ఒక నెట్ వర్క్ ను ఏర్పాటు చేసుకున్నట్లయితే, వారిని ఎదుర్కొనేందుకు మేము కూడా నెట్ వర్క్ ను ఏర్పాటు చేసుకుంటున్నాం' అని షాహి తెలియజేశారు.
Pages: -1- -2- 3 News Posted: 29 October, 2009
|