శిశు నిర్ధారణకు శిక్ష
డాక్టర్ ఛాయా టాటెడ్ ఒక పత్రికలో వేయించిన ప్రకటన ఆధారంగా ఆరోగ్యశాఖ అధికారి ఒకరు దాదర్ లోని మెటర్నిటీ హోమ్ కు వెళ్ళి, తనిఖీలు నిర్వహించిన తరువాత బొంబై మునిసిపల్ కార్పొరేషన్ (బిఎంసి)కి చెందిన జి/ఎన్ వార్డ్ ఆఫీసర్ ఒకరు 2004 నవంబర్ లో వారిద్దరిపై ఫిర్యాదు దాఖలు చేశారు. 'మగ శిశువు కావాలా?' అనే శీర్షికతో ప్రచురితమైన ఆ ప్రకటనలో టాటెడ్ తనను శ్రీ నర్సింగ్ హోమ్ లోను, ఔరంగాబాద్ లోనూ 'స్పెషలైజ్డ్ చికిత్స చేసే, విదేశాల్లో శిక్షణ పొందిన డాక్టర్'గా అభివర్ణించుకున్నారు.
బిఎంసి నలుగురు సాక్షులతో తన కేసును బలంగా రూపొందించింది. న్యాయవాది జరీర్ ఇంజనీర్ కోర్టులో బిఎంసి తరఫున వాదించారు. పిఎన్ డిటి చట్టం నిర్దేశిస్తున్నప్పటికీ నర్సింగ్ హోమ్ ను రిజిస్టర్ చేయలేదు. 'జెనెటిక్ కౌన్సెలింగ్' నిర్వహణకు సంబంధించిన సమగ్ర రికార్డు కూడా నర్సింగ్ హోమ్ లో లేదు. శిశు లింగ నిర్ధారణ కోసం పరీక్షలు నిర్వహించరాదనే హెచ్చరికతో బోర్డును కూడా నర్సింగ్ హోమ్ ఏర్పాటు చేయలేదు.
గర్భధారణకు ముందే ఏ శిశువు కావాలో ఎంచుకునేందుకు ప్రకటనలు ప్రచురించరాదని పిఎన్ డిటి చట్టం నిషేధిస్తున్నది. దీనిని ఉల్లంఘించినందుకు మూడు సంవత్సరాల కారాగార శిక్షను చట్టం నిర్దేశిస్తున్నది. టాటెడ్ తనను సమర్థించుకుంటూ, తాను ప్రకటన వేయిస్తున్నప్పుడు తనకు, తన ఏజెంట్ కు మధ్య సరైన కమ్యూనికేషన్ లేకపోవడం' ఇందుకు కారణమని పేర్కొన్నారు. టెలిఫోన్ లో ఆదేశాలు ఇచ్చేటప్పుడు 'ముల్గా' (బాలుడు) అనే పదాన్ని కాకుండా 'శిశువు' అని అర్థం ఉన్న 'మూల్' అనే మరాఠీ పదాన్ని తాను ఉటంకించానని ఆమె వాదించారు. 'పొరపాటును సరిదిద్దుతూ, 'శిశువు కావాలా' అనే కొత్త శీర్షికతో' మరొక ప్రకటనను 2004 డిసెంబర్ నెలలో తాను వేయించానని ఆమె తెలియజేశారు.
అయితే, ఆమె సమర్థనను 'తప్పు, కల్పితం' అని మేజిస్ట్రేట్ పేర్కొన్నారు. వాస్తవానికి, ఆమె ప్రకటనను విశ్వసించిన టాటెడ్ వ్యాపార సహచరులు ఒకరైన డిఫెన్స్ సాక్షి ఇచ్చిన సాక్ష్యం ఆమెకు వ్యతిరేకంగా ఉందని కోర్టు పేర్కొన్నది. మేగజైన్ లో ఆమె 'వివరణ' కేసు విచారణ నుంచి తనను తాను రక్షించుకొనడానికి చేసిన ప్రయత్నమేనని, ఎందుకంటే ఆమె దాదర్ నర్సింగ్ హోమ్ పేరును, 'విదేశాల నుంచి తిరిగి వచ్చిన వైద్యురాలిని' అనే సూచనను దురుద్దేశంతో మినహాయించారని, తనను 'హోమియోపతి నిపుణురాలు'గా పేర్కొన్నారని కోర్టు తెలిపింది. నర్సింగ్ హోమ్ పై బిఎంసి చర్య తీసుకోసాగిందని తెలిసే ఆమె రెండవ ప్రకటన వేయించారని కోర్టు స్పష్టం చేసింది.
Pages: -1- 2 -3- News Posted: 2 November, 2009
|