శిశు నిర్ధారణకు శిక్ష
నర్సింగ్ హోమ్ లో టాటెడ్ చేస్తున్న పనులతో తనకేమీ సంబంధం లేదని, ఒక హోమియోపతి వైద్యురాలిగా తనను అక్కడ అనుమతిస్తున్నారని, అందువల్ల ఈ ప్రకటన విషయంలో తనను దోషిగా పరిగణించరాదని డాక్టర్ అడ్కర్ వాదించారు. అయితే, ఆమెకు టాటెడ్ తో 'సుహృద్భావపూర్వక సంబంధాలు' ఉన్నాయని, అందువల్ల ఆమె ప్రమేయాన్ని తోసిపుచ్చజాలమని మేజిస్ట్రేట్ స్పష్టం చేశారు. అంతేకాకుండా, ఈ 'నేరంలో ఆమెకు నిజంగానే పాత్ర లేకపోయినట్లయితే, బిఎంసి తనిఖీ సమయంలో మాత్రమే ప్రకటన గురించి తెలిసి ఉన్నట్లయితే, టాటెడ్ అక్రమ ప్రవర్తన గురించి హోమియోపతి బోర్డుకు ఎందుకు సమాచారం అందజేయలేకపోయారు' అని మేజిస్ట్రేట్ ప్రశ్నించారు.
'పిఎన్ డిటి చట్టం కింద రిజిస్టర్ కాని టాటెడ్ నర్సింగ్ హోమ్ లో ఆమెకు చేయూత ఇస్తుండడం ద్వారా డాక్టర్ అడ్కర్ తన సమ్మతిని సూచించారు' అని మేజిస్ట్రేట్ పేర్కొన్నారు. ప్రతి జెనెటిక్ కౌన్సెలింగ్ కేంద్రాన్ని ఈ చట్టం కింద నమోదు చేయాలి. లింగ నిర్ధారణ కోసం ప్రసూతి ముందు వైద్య పరీక్షలను అనుమతించజాలరు. నిర్దుష్టమైన జన్యుపరమైన లోపాలు లేవని తేల్చేందుకు కుటుంబ చరిత్రను పరిశీలించేందుకు తగిన అర్హతలున్న జెనెటిక్ కౌన్సెలర్ ద్వారా మాత్రమే ఆ కేంద్రంలో డయాగ్నోస్టిక్ పరీక్షలు నిర్వహించవచ్చు. ఈ కేసులో జెనెటిక్ కౌన్సెలింగ్ కేంద్రాన్ని నడిపేందుకు అర్హతలు ఏమీ లేకపోయినప్పటికీ నిందితులు ఇద్దరూ డాక్టర్ అడ్కర్ నర్సింగ్ హోమ్ లో ఆ పని చేస్తూ వచ్చారని, ఇది 'అమాయక ప్రజల పట్ల నయవంచనే' అవుతుందని మేజిస్ట్రేట్ పేర్కొన్నారు. ఈ కేసులో టాటెడ్ తరఫున డి. ఘాటె వాదించారు.
Pages: -1- -2- 3 News Posted: 2 November, 2009
|