కారైనా లేదు - బైకు ఉంది ఇతరులు అనేక మంది వివిధ పద్దుల కింద విడివిడిగా ఎంట్రీలతో విలువలు సూచించారు. కాని మొత్తం ఆస్తి విలువ ఎంతో వారు పేర్కొనలేదు. దీనితో వారి ఆస్తుల సరిపోల్చడం కష్టం అవుతున్నది. జస్టిస్ హెచ్.ఎస్. కపాడియా వెల్లడించిన వివరాల ప్రకారం ఆయన ఆస్తిని ఉజ్జాయింపుగా లెక్క వేస్తే అది సుమారు కోటి రూపాయలు ఉండవచ్చు.
సుప్రీం కోర్టు ఈ చర్యను 'ఎప్పుడో తీసుకుని ఉండవలసింది' అని సీనియర్ న్యాయవాది రాజీవ్ ధావన్ వ్యాఖ్యానించారు. అయితే, వారి ఆస్తుల మదింపు పట్ల ఆయన అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. కాగా, పేరు వెల్లడికి ఇష్టపడవి మరొక న్యాయవాది మాట్లాడుతూ, 'అవి అధికారిక భూముల రేట్లు అయి ఉండాలి' అని అన్నారు.
భూముల మార్కెట్ రేట్లు సాధారణంగా ప్రభుత్వ రేట్ల కన్నా నాలుగింతల నుంచి 12 రెట్ల వరకు ఎక్కువగా ఉంటాయి. ఎన్నికల్లో నామినేషన్ల సమయంలో రాజకీయ నాయకులు ప్రకటించిన ఆస్తుల వివరాలకు కూడా సాధారణంగా అధికారిక భూముల రేట్లే ఆధారంగా ఉంటాయి. కాని వారు అప్పటికీ న్యాయమూర్తుల కన్నా ఎక్కువ సంపన్నులని అనిపిస్తున్నది.
న్యాయమూర్తులు వెల్లడించిన సమాచారం 'సమగ్రంగా లేదు' అని న్యాయ కోవిదుడు ప్రశాంత్ భూషణ్ వ్యాఖ్యానించారు. తాము ప్రకటించిన ఆస్తుల వివరాలు సిసలైనవేనని ప్రమాణం చేస్తూ న్యాయమూర్తులు అపిడవిట్లను జతపరచకపోవడం పట్ల ఆయన విచారం వెలిబుచ్చారు. 'అఫిడవిట్లు లేనందున ఆస్తులను తప్పుగా వెల్లడి చేసినందుకు ఏ జడ్జినైనా ప్రాసిక్యూట్ చేయడం ఎంతో కష్టం కాగలదు' అని ఆయన అన్నారు.
Pages: -1- 2 -3- News Posted: 3 November, 2009
|