కారైనా లేదు - బైకు ఉంది ఈ ప్రకటనలలో (ఆదాయ వనరులు,ఆస్తుల మధ్య) వ్యత్యాసాలను జనం కనుగొని ప్రస్తావించగలరని ప్రశాంత్ భూషణ్ ఆశాభావం వ్యక్తం చేశారు. కొట్టవచ్చినట్లు కనిపించే వ్యత్యాసాలు అందరికీ దృష్టికీ వచ్చినట్లయితే అటువంటి డిక్లరేషన్లకు సంబంధించిన ప్రక్రియను ప్రామాణీకృతం చేయడంపై చర్చ మొదలు కాగలదని ఆయన సూచించారు.
న్యాయమూర్తులు ఇప్పటి వరకు ఏటా 'ఐచ్ఛికంగా' తమ ఆస్తుల వివరాలను సిజెఐకి సమర్పిస్తున్నారు. కాని వాటిని ప్రజలకు తెలియజేయకుండా గోప్యంగా ఉంచుతున్నారు. సిజెఐ ఇంకా ఢిల్లీ హైకోర్టులో ఒక కేసులో పోరాడుతున్నారు. ఆయా న్యాయమూర్తులు సమర్పించిన ఆస్తుల వివరాలను సమాచార హక్కు (ఆర్ టిఐ) చట్టం కింద జనానికి అందుబాటులోకి తీసుకురావాలని ఢిల్లీ హైకోర్టు తీర్పు ఇచ్చింది. అయితే, సంక్లిష్టమైన పద్ధతి ద్వారా మాత్రమే ఆ ఆస్తుల వివరాలను పరిశీలించవచ్చునని, సమాచారం కోరే వ్యక్తి తన అర్హతలను నిరూపించుకోవలసి ఉంటుందని హైకోర్టు సూచించింది.
ఢిల్లీ హైకోర్టు తీర్పుపై సుప్రీం కోర్టు రిజిస్ట్రీ అప్పీలు చేసింది. ఈ లోగా అందరి దగ్గర నుంచి ఒత్తిడికి తలొగ్గి జడ్జీల ఆస్తుల వివరాలను ప్రజలకు అందుబాటులో ఉంచాలని రిజిస్ట్రీ నిర్ణయించింది. కాని ఇందుకు కూడా ఒక నెల వ్యవధి పట్టింది. 'విధివిధానాలను ముందు రూపొందించవలసి ఉంటుంది' అని సిజెఐ చెప్పారు. తమ ఆస్తుల వివరాలను ప్రజలకు అందుబాటులో ఉంచాలని న్యాయమూర్తులు ఏకగ్రీవంగా నిర్ణయించిన తరువాత సిజెఐ అలా చెప్పారు.
Pages: -1- -2- 3 News Posted: 3 November, 2009
|