అందానికి 'అరటి' చీర కొద్దిగా మెరుపు ఉండే ఈ చీరలు తేలికగాను, గాలి చొరబడే విధంగాను ఉన్నాయి. శేఖర్ రెండు సంవత్సరాల క్రితం ఈ చీరలను ప్రవేశపెట్టినప్పటి నుంచి త్వరగానే అందరినీ ఆకట్టుకున్నాయి. వీటి ధరలు రూ. 700 నుంచి రూ. 4000 వరకు ఉంటాయి. కంటికి నదరుగా కనిపించేలా పట్టు పోగులు కూడా చేర్చి నేయవలసిందిగా కొందరు కస్టమర్లు కోరుతున్నారు.
అరటి చీరలు చిరకాలం మన్నుతాయా అనే ప్రశ్నకు శేఖర్ భార్య పద్మ సమాధానంగా తన బట్టల అలమారలో ఏడాది పై నుంచి తాను వాడుతున్న ఒక చీరను చూపించింది. తాను చాలా సార్లు దానిని ఉతికినట్లు కూడా 36 సంవత్సరాల పద్మ చెప్పింది. శేఖర్ కొన్ని నెలల క్రితం ఆకులు మందంగా ఉండే మొక్క అలో వెరాతో ప్రయోగం ప్రారంభించి, దీని పీచుతో చీరను నేయగలిగాడు. దీని నుంచి తీసిన పదార్థాలను బ్యూటీ ఉత్పత్తులలోను, హెర్బల్ ఔషధంగాను ఉపయోగిస్తున్నారు. 'ఇది ఇంకా చల్లగా హాయిగా ఉంటుంది. దీనిని ధరించిన ఒక కస్టమర్ 'ప్రకృతిని ధరించినట్లుగా ఉంది' అని చెప్పింది' అని శేఖర్ తెలియజేశాడు.
ప్రత్యామ్నాయంగా ప్రకృతిసిద్ధమైన పీచును ఉపయోగించడానికి అతనికి ఏది కారణమైంది? 'అవసరమే ఏ సృష్టికైనా మూలం' అనే ప్రాచీన నానుడిని అతను ఈ సందర్భంగా ప్రస్తావించాడు. పత్తి నూలు ధర బాగా పెరిగిపోయింది. మరమగ్గాలు రావడంతో చేనేత కార్మికులకు జీవనోపాధి దాదాపుగా హరించుకుపోయింది. ఒకప్పుడు అంటే 1960 దశకంలో పది వేల పైచిలుకు మగ్గాలు ఉన్న అనకపుత్తూరులో ఇప్పుడు 400 పైచిలుకు మగ్గాలు మాత్రమే ఉన్నాయి. అంతే కాకుండా, ఈ ప్రాంతానికి చెందిన ప్రసిద్ధ ఉత్పత్తి 'రియల్ మద్రాస్ హ్యాండ్ కర్చీఫ్'ను తయారు చేయడం 1960 దశకం తరువాత నిలచిపోయింది. ఆఫ్రికాలోని నైజీరియా వీటి దిగుమతిని నిషేధించడం ఇందుకు కారణం. ఆరు గజాల పొడుగు, మూడడుగుల వెడల్పు ఉండే కొట్టవచ్చినట్లు కనిపించే రంగులతో కూడిన ఈ వస్త్రాన్ని నైజీరియాలో జాతీయ దుస్తుల కోసం అంతకుముందు ఉపయోగించేవారు.
Pages: -1- 2 -3- News Posted: 4 November, 2009
|