అందానికి 'అరటి' చీర అందువల్ల ప్రత్యామ్నాయం కోసం అన్వేషిస్తున్న శేఖర్ జనము, వెదురు, అనాస, అవిసె వంటి ప్రకృతి వనరులు వేటి నుంచైనా తీసిన పీచును ఉపయోగించసాగాడు. అతను ఇప్పుడు 25 రకాల ప్రకృతి సిద్ధమైన పీచులతో ఒక చీరను నేస్తున్నాడు. అతను తన ఉత్పత్తులను స్థానిక జనపనార నేత కార్మికుల సంఘం ద్వారా విక్రయిస్తుంటాడు. దీని వల్ల ప్రతి ఒక్కరూ లబ్ధి పొందుతారు. ప్రకృతిసిద్ధమైన పీచుతో కూడా డబ్బు సంపాదించవచ్చుననే భరోసా కూడా లభిస్తుంటుంది.
'మొత్తం సమాజం పూనుకుంటే తప్ప చేనేత పరిశ్రమకు తిరిగి పూర్వ వైభవం చేకూరదు' అని శేఖర్ అంటున్నాడు. తన ఇద్దరు కుమారులు తన వలె నేత కార్మికులు కాగలరని అతను ఘంటాపథంగా చెబుతున్నాడు. మరి ప్రభుత్వం నుంచి ఏమన్నా ఆశిస్తున్నారా అనే ప్రశ్నకు పరిశోధన కోసం నిధులు, నేత కార్మికులకు సముచిత గృహవసతి అని శేఖర్ సంకోచిస్తూనే సమాధానం ఇచ్చాడు. 'మిగిలిన విషయాలు మేము చూసుకుంటాం' అని శేఖర్ చెప్పాడు.
Pages: -1- -2- 3 News Posted: 4 November, 2009
|