భారత్ లో యుఎస్ వర్శిటీలు ఈ వినూత్న విశ్వవిద్యాలయాలు ఇండియా స్థానిక అవసరాలపై దృష్టి కేంద్రీకరించే విద్యా కేంద్రాలు కాగలవని, అయితే, ప్రపంచమంతటికీ వర్తించే పరిష్కారాలను రూపొందించగలవని సిబల్ వివరించినట్లు తెలుస్తున్నది. 'ఈ విశ్వవిద్యాలయాలు ప్రపంచ శ్రేణిలో ఉండాలనేది మా ఆకాంక్ష. అమెరికన్ విశ్వవిద్యాలయాలకు ఆవిధంగానే వీటి గురించి విశదంగా తెలియజేశాం' అని అధికార ప్రతినిధి ఒకరు చెప్పారు.
దాదాపు అర్ధ శతాబ్దం అనంతరం అగ్ర శ్రేణి అంతర్జాతీయ విద్యా సంస్థల సహకారాన్ని స్వీకరించడానికి ఇండియా ప్రయత్నిస్తున్నది. అప్పట్లో స్వాతంత్ర్యం సిద్ధించిన అనంతరం సొంతంగా ఉన్నత విద్యా కేంద్రాల ఏర్పాటుకు ప్రపంచ విశ్వవిద్యాలయాల సాయాన్ని ఇండియా తీసుకున్నది.
కాన్పూర్ ఇండో-అమెరికన్ ప్రోగ్రామ్ (కెఐఎపి)గా పేర్కొనే తొమ్మిది అమెరికన్ విశ్వవిద్యాలయాల సహాయతా సంఘం (కన్సార్షియం)కు ఎంఐటి సారథ్యం వహిస్తున్నది. కాన్పూర్ లో ఇండియన్ ఇన్ స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (ఐఐటి) ఏర్పాటులోను, ప్రముఖ ఇంజనీరింగ్ విద్యా సంస్థగాను తీర్చిదిద్దడంలోను కెఐఎపి సాయం చేసింది. కాన్పూర్ ఐఐటిని 1959లో ప్రారంభించారు. కాని ఎంఐటి ప్రొఫెసర్ ఎన్.సి. దహల్ నాయకత్వంలో ముగ్గురు నిపుణుల బృందం పర్యటన జరిపిన అనంతరం కేంబ్రడ్జి, మసాచ్యుసెట్స్ ఇన్ స్టిట్యూట్ ల నుంచి సహకారం లభించింది. 1972 వరకు కొనసాగిన ఆ సహకారం ప్రధానంగా మూడు సూత్రాలతో కూడుకుని ఉన్నది.
Pages: -1- 2 -3- News Posted: 6 November, 2009
|