భారత్ లో యుఎస్ వర్శిటీలు
భారతీయ అధ్యాపకులను కెఐఎపి కన్సార్షియం విశ్వవిద్యాలయాలకు తీసుకువెళ్ళి శిక్షణ, పరిశోధన, పాలనా నిర్వహణ వంటి కార్యక్రమాల గురించి సవివరంగా తెలియజేసి, బోధనానుభవం కూడా కలిగేట్లు చూశారు. అమెరికన్ నిపుణులు ఐఐటిని సందర్శించారు. ఐఐటిలో పని చేశారు. ప్రత్యేకంగా ఇన్ స్టిట్యూట్ లో వివిధ విభాగాల అభివృద్ధి కార్యక్రమాన్ని, పరిశోధన కృషిని పర్యవేక్షించారు. అప్పట్లో ఇండియాలో లభించని పుస్తకాలు, ఇతర బోధన పరికరాలు, పరిశోధన పరికరాల విషయంలో ఐఐటికి ఎంఐటి సాయం చేసింది.
ఇతర దేశాలలోని, ముఖ్యంగా జర్మనీ, పూర్వపు సోవియట్ యూనియన్, యునైటెడ్ కింగ్ డమ్ (యుకె)లలోని ఉన్నత స్థాయి విద్యా సంస్థలు ఇతర ఐఐటిల ఏర్పాటుకు తోడ్పడ్డాయి. సిబల్ ఇటీవల తన పర్యటనలో ఈ విశ్వవిద్యాలయాలలో పాలనా యంత్రాంగం అధికారులు, విద్యార్థులతో చర్చలు జరిపినప్పుడు ఇండియాతో వీటి సహకారం ఎప్పటి నుంచి ఉన్నదో ప్రస్తావించారు.
అయితే, అప్పటి సహకారానికి, ఇప్పటి సహకారానికి మధ్య గల తేడా గురించి ప్రభుత్వ అధికారులు వివరించారు. 'అప్పట్లో మనది కొత్తగా స్వాతంత్ర్యం పొందిన దేశం. తెలిసిన సాంకేతిక పరిజ్ఞానం తక్కువ. విదేశీ సహాయం అవసరమైంది. కాని ఇప్పటి పరిస్థితి అలా లేదు. వారి సాయం నుంచి మనం తప్పకుండా ప్రయోజనం పొందగలం. అదే సమయంలో ఈ సహకారంతో వారూ ప్రయోజనం పొందగలరు' అని అధికారి ఒకరు చెప్పారు. విదేశాలలో విద్యార్జన వ్యయాన్ని భరించలేని భారతీయ విద్యార్థులకు సంబంధిత విదేశీ విశ్వవిద్యాలయాల సేవలను అనుమతించడం కూడా ఈ సహకారంలో భాగం కాగలదని భారతీయ అధికారులు తెలియజేశారు. ఈ వినూత్న విశ్వవిద్యాలయాలు విదేశీ వర్శిటీలతో సహకార కార్యక్రమాలను ప్రారంభించవచ్చు. భారతదేశ ఉన్నత విద్యా వ్యవస్థ ప్రతిపత్తి పెరుగుతున్న కారణంగా అగ్రశ్రేణి ప్రపంచ విద్యా సంస్థలు ఈ విధమైన సహకారానికి సుముఖంగా ఉంటున్నాయి.
Pages: -1- -2- 3 News Posted: 6 November, 2009
|