'ఢిల్లీయేతరుడే బిజేపీ చీఫ్' బిజెపి యువతరంలో స్పర్థలు, సంఘ్ పరివార్ లో అంతర్గతంగా తీవ్ర వర్గ వైరుధ్యాలు వారికి అవకాశాలు లేకుండా చేసినట్లున్నది. ఢిల్లీకి చెందని నాయకుని నియమించాలనే ప్రతిపాదన నాయక శ్రేణిలో స్థిరత్వాన్ని, పార్టీ కార్యక్రమాలు, విధానాలలో పొంతనను ఏవిధంగా తీసుకువస్తుందో స్పష్టం కావడం లేదు. అంతగా పేరు ప్రఖ్యాతులు లేని నేత అయితే బిజెపిపై ఆర్ఎస్ఎస్ పట్టు బిగించడానికి అవకాశం లభించవచ్చు. కాని పార్టీలోనే ఒక విధమైన అనిశ్చితి నెలకొనవచ్చు.
'ఇతర ప్రాంతాల' నాయకులే మేలనే సిద్ధాంతం బిజెపి సమస్యలకు తప్పనిసరి పరిష్కారం కాగలదని భావించలేమని, రాజనాథ్ సింగ్ నాలుగేళ్ల 'రాజ్యం' ఈ విషయాన్ని స్పష్టంగా సూచించిందని పార్టీ పరిశీలకులు అంటున్నారు. రాజనాథ్ సింగ్ కేంద్ర నాయకుల 'సర్క్యూట్'కు చెందని నాయకుడే. కాని ఆయన హయాంలో పార్టీలో కుట్రలు, కుతంత్రాలు చోటు చేసుకున్నాయని చాలా మంది భావిస్తున్నారు. చివరకు ఆర్ఎస్ఎస్ జోక్యం చేసుకోవలసిన పరిస్థితి తలెత్తింది.
ఆర్ఎస్ఎస్ కారణంగానే తనకు ఈ పదవి లభించిందని భావించే రాష్ట్ర నాయకుడు స్వతంత్రంగా నిర్ణయాలు తీసుకోలేకపోవచ్చుననే ఆందోళన పార్టీలో వ్యక్తమవుతున్నది. విశేష అనుభవం ఉన్న పార్టీ పార్లమెంటరీ నేతల వద్ద వ్యవహరించేటప్పుడు ఆ నాయకుడు ఆత్మవిశ్వాసంతో వ్యవహరించలేకపోవచ్చు. కేంద్ర నాయకత్వం బలహీనంగా ఉండడం నష్టదాయకం కాగలదని పార్టీ వర్గాలు పేర్కొంటున్నాయి.
Pages: -1- -2- 3 News Posted: 7 November, 2009
|