వారసత్వాలకు ఇక చెక్ కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియా గాంధి ఈ ధోరణి పట్ల తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారని పార్టీ వర్గాలు తెలియజేశాయి. ముఖ్యంగా ఆంధ్ర ప్రదేశ్, మహారాష్ట్రలలో పరిణామాల పట్ల ఆమె కలత చెందారని ఆ వర్గాలు తెలిపాయి. తన తండ్రి వై.ఎస్. రాజశేఖరరెడ్డి మరణానంతరం రాష్ట్ర ముఖ్యమంత్రి పీఠం కోసం జగన్మోహన్ రెడ్డి తీవ్ర స్థాయిలో ప్రయత్నాలు సాగించగా మహారాష్ట్ర ఎన్నికలలో దాదాపు పార్టీ సీనియర్ నాయకులు అందరూ తమ కుమారులకు లేదా కుమార్తెలకు టిక్కెట్లు కోరారు.
తన కుమారునికి టిక్కెట్ కోసం రాష్ట్రపతి ప్రతిభా పాటిల్ పట్టుబట్టడం సోనియాను మరింతగా కలవరపరిచిందని పార్టీ వర్గాలు తెలిపాయి. నెహ్రూ - గాంధి కుటుంబం కూడా అటువంటి ఆరోపణనే ఎదుర్కొంటున్నందున ఈ నేతల విషయంలో సోనియా కరాఖండిగా వ్యవహరించలేకపోయినట్లు ఆ వర్గాలు తెలిపాయి. అయితే, చిన్న చిన్న ఆనువంశిక రాజకీయాల నుంచి 'మొదటి కుటుంబాన్ని' వేరు చేసేందుకు ఇప్పుడు ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఆనువంశిక రాజకీయాలను ఒక సమస్యగా సాక్షాత్తు రాహుల్ గాంధి అభివర్ణించిన తరువాత ఈ ప్రయత్నం ప్రారంభమైంది.
నాయకుల బంధువులకు టిక్కెట్ల విషయంలో కఠిన విధానాన్ని అనుసరించనున్నట్లు పార్టీ వర్గాలు తెలిపాయి. మహారాష్ట్రలో పలువురు సీనియర్ నాయకులు పిల్లలు గెలుపొందినప్పటికీ , ఆనువంశిక రాజకీయాల ధోరణి వల్ల ఇటీవల గుజరాత్, ఢిల్లీ ఉప ఎన్నికలలో కాంగ్రెస్ ఎంతో నష్టపోయింది.విజయావకాశాలే ఏకైక అర్హత కాజాలదని పార్టీ సీనియర్ నాయకుడు ఒకరు అన్నారు. 'బడా నేతల పిల్లలకు పార్టీ ఊయల కాదు. టిక్కెట్లపై ఆకాంక్షలు ఉన్న సాధారణ కార్యకర్తలు లక్షలాది మందికి ఈ సందేశం చేరవలసి ఉంటుంది' అని ఆ నాయకుడు సూచించారు.
Pages: -1- 2 -3- News Posted: 11 November, 2009
|