వారసత్వాలకు ఇక చెక్ 'సేవలు, త్యాగం లేకుండా ఆనువంశిక రాజకీయాలను జనం సహించబోరు' అని కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి, పార్టీ ముఖ్య అధికార ప్రతినిధి జనార్దన్ ద్వివేది అన్నారు. నెహ్రూ - గాంధి కుటుంబానికి, తమ సంతానాన్ని రాజకీయాలలోకి తీసుకువచ్చేందుకు ప్రయత్నిస్తున్న ఇతర నేతలకు మధ్య వ్యత్యాసం ఉందని ఆయన ఈవిధంగా అన్యాపదేశంగా సూచించారు.
అన్ని రాజకీయ పార్టీలు ఫిరోజాబాద్ ఎన్నిక నుంచి పాఠం నేర్చుకోవలసి ఉంటుందని ద్వివేది అంగీకరించారు. అయితే, ములాయంపై ఆయన విమర్శనాస్త్రాలు సంధిస్తూ, 'రాజకీయాలలో కొన్ని ఆదర్శాలు ఉండాలి. అన్ని పార్టీలకు కుటుంబ రాజకీయాల సంప్రదాయం ఉంది. కాని 'కర్మ్-విహీన్ పరివార్ వాద్' (ఏ ఘనతా లేని ఆనువంశిక రాజకీయాలు)ను తిరస్కరిస్తారు. (రామ్ మనోహర్) లోహియా పేరు మీద రాజకీయాలు చేస్తున్నవారు ఆయన సిద్ధాంతాలను అనుసరించాలి. నాయకులు ఆశ్రిత పక్షపాతానికి, ధనార్జనకు పాల్పడరాదని ఆయన అంటుండేవారు' అని పేర్కొన్నారు.
అయితే, ఈ రకమైన విమర్శలకు ములాయం గట్టిగానే సమాధానం ఇవ్వవచ్చు. కాని ఆనువంశిక రాజకీయాల అంశంపై కూలంకషంగా చర్చకు సిద్ధం కాకపోయినట్లయితే కాంగ్రెస్ ఈ విషయాన్ని ప్రస్తావించి ఉండదు. నేతల సంతానానికి రాజకీయ వారసత్వాన్ని నిలబెట్టుకునే హక్కు జన్మతః రాదనే సందేశాన్ని పంపాలనే పట్టుదలతో సోనియా ఉన్నారు. రాహుల్ గాంధికి ప్రధాని పదవిని కట్టబెట్టాలనే కోరేవారి సంఖ్య పార్టీలో అధికంగా ఉన్నా మన్మోహన్ సింగ్ ప్రధాని పదవిలో కొనసాగాలని ఆమె పట్టుబట్టుతున్నది ఇందుకేనని కాంగ్రెస్ నాయకులు చెబుతున్నారు. అనుభవం సంపాదించడానికి తాను ముందు రాజకీయ అప్రెంటిస్ షిప్ చేయాలని అనుకుంటున్నట్లు రాహుల్ స్వయంగా చెప్పారు కూడా.
Pages: -1- -2- 3 News Posted: 11 November, 2009
|