మరుగుదొడ్లో మహానేతలు 'కేంద్ర క్యాబినెట్ మంత్రుల నియోజకవర్గాలలో పారిశుద్ధ్య కార్యక్రమం అమలు తీరును పర్యవేక్షించడంలో ప్రధానోద్దేశ్యం సమగ్ర అభివృద్ధి సాధనకు ఈ ప్రాథమిక అవసరం పట్ల నిబద్ధత, రాజకీయ చిత్తశుద్ధి ఉండడం తప్పనిసరి అని స్పష్టం చేయడమే' అని నివేదిక పేర్కొన్నది. 'కీలకమైన ఈ మానవ అవసరం గురించి ప్రజలను చైతన్యపరచాలని, మన విధాన నిర్ణేతలు తమ సొంత నియోజకవర్గాలలో దీనికి ఏవిధమైన ప్రాధాన్యం ఇస్తున్నారో అవగాహన కలిగించాలని మేము అనుకున్నాం' అని నివేదికలో సంస్థ వివరించింది. కేంద్ర మంత్రులలో చాలా మంది ఈ విషయంలో ఇక చురుకుగా వ్యవహరించవలసిన అవసరం ఉందని ఇది సూచిస్తున్నది.
ఇది ఇలా ఉండగా, ఆంధ్ర ప్రదేశ్ లో గ్రామాలలో 60 శాతం ఇళ్ళలోను, పట్టణ ప్రాంతాలలో 25 శాతం ఇళ్ళలోను ఇప్పటికీ ఒక్క మరుగుదొడ్డి కూడా లేదు. ఒక వేళ మరుగుదొడ్లను నిర్మించినప్పటికీ వాటిని ఉపయోగించడం లేదని తెలుస్తున్నది. గడచిన పదేళ్లలో రాష్ట్రంలో సుమారు 42 లక్షల మరుగుదొడ్ల నిర్మాణం జరిగింది. కాని వాటిలో 70 శాతం మరుగుదొడ్లను ఉపయోగించడం లేదు.
అధికారిక గణాంకాల ప్రకారం, దేశంలో ఉపయోగంలో ఉన్న మరుగుదొడ్ల సంఖ్య అత్యల్పంగా ఉన్న రాష్ట్రం ఆంధ్ర ప్రదేశే. మరుగుదొడ్లను నిర్మించడానికి ఇచ్చిన నిధులను కూడా అవసరానికి కాకుండా ఇతర అవసరాలన్నిటికీ ఉపయోగిస్తున్నట్లు కూడా తెలుస్తున్నది. గ్రామాలలో చాలా ఇళ్ళలో ధాన్యం నిల్వకు గాదెలుగాను, లేదా వంటగదులుగాను లేదా చెత్త వేసే స్థలాలుగాను ఉపయోగిస్తున్నారు.
Pages: -1- -2- 3 News Posted: 19 November, 2009
|