మరుగుదొడ్లో మహానేతలు కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధి నియోజకవర్గం రాయబరేలి 2012 గడువుకు తన లక్ష్యాన్ని సాధించనున్నది. కాని ఆమె కుమారుడు రాహుల్ గాంధి ఈ పందెంలో వెనుకబడ్డారు. రాహుల్ నియోజకవర్గం అమేథి ఉన్న ఉత్తర ప్రదేశ్ సుల్తాన్ పూర్ జిల్లా ఈ లక్ష్యాన్ని 2015లో మాత్రమే చేరుకోవచ్చునని అనుకుంటున్నారు.
ప్రతిపక్ష నాయకుడు ఎల్.కె. అద్వానీ నియోజకవర్గం గుజరాత్ లోని గాంధీనగర్ గడువుకు ఐదు సంవత్సరాలు వెనుకబడి ఉంది. అయితే, ప్రధాని పదవికి పోటీలో పరాజితుడైన బిజెపి నాయకుడు అద్వానీ కనీసం సంపూర్ణ పారిశుద్ధ్య లక్ష్యం సాధన పోటీలోనైనా మన్మోహన్ సింగ్ పై నెగ్గనున్నారు. రాజ్యసభ సభ్యుడుగా ప్రధాని డాక్టర్ మన్మోహన్ సింగ్ కు అధికార స్వస్థలమైన అసోంలోని కామరూప్ జిల్లా వాసులు పూర్తి పారిశుద్ధ్యం కోసం 2030 వరకు వేచి ఉండవలసి ఉంటుంది.
కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి ప్రణబ్ ముఖర్జీ నియోజకవర్గం బెంగాల్ లోని ముర్షిదాబాద్ గడువు కన్నా ఒక సంవత్సరం మాత్రమే ఆలస్యంగా లక్ష్యాన్ని చేరుకుంటుంది. కేంద్ర హోమ్ శాఖ మంత్రి పి. చిదంబరం నియోజకవర్గం తమిళనాడులోని శివగంగ పరిస్థితి కూడా అదే.
అయితే, వారిద్దరూ కార్మిక శాఖ మంత్రి మల్లికార్జున్ ఖర్గె, న్యాయ శాఖ మంత్రి వీరప్ప మొయిలీ, ఫుడ్ ప్రాసెసింగ్ పరిశ్రమల శాఖ మంత్ర సుబోధ్ కాంత్ సహాయ్ ల కన్నా మెరుగే. అజాద్ తరువాత ఈ ముగ్గురి నియోజకవర్గాలు ఈ విషయంలో బాగా వెనుకబడ్డాయి. పూర్తి పారిశుద్ధ్యం కోసం ఖర్గె నియోజకవర్గం కర్నాటకలోని గుల్బర్గా 2055 వరకు, సహాయ్ నియోజకవర్గం రాంచి 2035 వరకు, మొయిలీ నియోజకవర్గం 2034 వరకు వేచి ఉండవలసి ఉంటుంది.
జిల్లాలో ప్రస్తుత మరుగుదొడ్ల సౌకర్యాలు, వార్షిక నిర్మాణ రేటు ఆధారంగా వాటర్ ఎయిడ్ సంస్థ ఈ అంచనాలకు వచ్చింది. అయితే, పట్టణ ప్రాంతాలను ఈ సంస్థ విశ్లేషణకు పరిగణనలోకి తీసుకోలేదు.
Pages: -1- 2 -3- News Posted: 19 November, 2009
|