నేతలపై 'బార్బోరా' దాడి రాజకీయ కక్షలు తీర్చుకోవడానికి రక్షణ పరికరాల కొనుగోలు ఒప్పందాలను ఉపయోగించుకునే రాజకీయ పార్టీల వైఖరిని, రక్షణ రంగంలో ప్రైవేట్ సంస్థలకు, విదేశీ ప్రత్యక్ష పెట్టుబడి (ఎఫ్ డిఐ)లకు అవకాశం కల్పించడంపై అర్ధమనస్కంగా తీసుకుంటున్న చర్యలను బార్బొరా ఈ దఫా ఎండగట్టారు.
ఒక్కొక్క పైటర్ పైలట్ శిక్షణపై రూ. 11 కోట్లకు పైగా ఖర్చు చేస్తున్నందున ఫైటర్ పైలట్ కావాలని ఆకాంక్షించే మహిళలకు నిర్దిష్ట కాలం సంతానం ఉండరాదనడం వంటి ముందస్తు షరతులను విధించవలసి ఉంటుందనేది తన 'వ్యక్తిగత అభిప్రాయమే'నని, ఐఎఎఫ్ లేక రక్షణ మంత్రిత్వశాఖది కాదని ఎయిర్ మార్షల్ బార్బొరా ముందుగా వివరించారు. 'నేను లోగడ చెప్పినట్లుగా, ఏదో ఒక యుద్ధ సైనిక బాధ్యతల నిర్వహణలో యుద్ధ విమానాలను మహిళలు నడపడాన్ని మనం సమీప భవిష్యత్తులోనే చూడగలమనేది నా దృఢ విశ్వాసం. (అయితే,) అది క్రమక్రమంగా తీసుకోవలసిన చర్య' అని ఆయన చెప్పారు.
ఆతరువాత 'భారత గగనతల రంగాన్ని శక్తిమంతం చేయడం' అనే అంశంపై అంతర్జాతీయ మహాసభలో ప్రసంగించినప్పుడు ఎయిర్ మార్షల్ బార్బొరా 'బాధ్యతారహిత రాజకీయాల' సంస్కృతిపై విరుచుకుపడ్డారు. ఇది దేశ రక్షణ సన్నద్ధతకు 'తీవ్రమైన హాని కలిగిస్తున్నది' అని ఆయన అన్నారు. 'ఇన్ని సంవత్సరాలుగా అంతర్గత రాజకీయాల తీరు ఎలా ఉందంటే, ప్రభుత్వం రక్షణ రంగం అవసరాలను ఆమోదించినప్పుడల్లా ప్రతిపక్షాలు అభ్యంతరం చెబుతున్నాయి. అధికార, ప్రతిపక్షాల పాత్రలు మారి ప్రతిపక్షం ప్రభుత్వంలోకి వచ్చినప్పుడు అదే జరుగుతున్నది' అని ఆయన అన్నారు.
Pages: -1- 2 -3- News Posted: 20 November, 2009
|