నేతలపై 'బార్బోరా' దాడి పూర్వపు ప్రభుత్వం కుదుర్చుకున్న రక్షణ ఒప్పందాలను కేంద్ర విజిలెన్స్ కమిషన్ (సివిసి) దృష్టికి తీసుకురావడం ద్వారా రాజకీయ లబ్ధి పొందాలనే ధోరణి వల్ల సైనిక దళాల ఆధునికీకరణ ప్రక్రియ స్తంభించిపోతున్నది. 'ప్రతి ఒక్కరు పరస్పరం అనుమాన దృక్కులతో చూస్తుంటారు' అని ఆయన అన్నారు. 'అనవలసిన మాటలను అన్నందుకు క్షమించవలసింది'గా కోరుతూనే ఎయిర్ మార్షల్ బార్బొరా రక్షణ రంగంలో ఎఫ్ డిఐలను అనుమతించేందుకు, ఆయుధాల ఉత్పత్తి వ్యాపారంలో దేశీయ ప్రైవేట్ రంగ సంస్థల పాత్రను పెంచేందుకు ఇండియా 'ధైర్యంగా' నిర్ణయాలు తీసుకోవాలనే అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు.
పటిష్ఠమైన రక్షణ - పారిశ్రామిక పునాదిని ఏర్పరచే లక్ష్యంతో 1991 మే నెలలో రక్షణ పరిశ్రమ రంగంలో 100 శాతం ప్రైవేట్ పెట్టుబడులకు అనుమతి ఇచ్చారు. ఇందులో 26 శాతం వరకు ఎఫ్ డిఐకి అవకాశం కల్పించారు. అప్పటి వరకు రక్షణ రంగం అవసరాలను పూర్తిగా ప్రభుత్వ రంగ సంస్థలే తీరుస్తూ వచ్చాయి. అయితే, ఆ విధానం వల్ల అంతగా ఫలితాలు సిద్ధించలేదు. సైనిక దళాలు తమ సైనిక అవసరాలలో సుమారు 70 శాతాన్ని రష్యా, ఇజ్రేల్, ఫ్రాన్స్, యుకె, యుఎస్ వంటి దేశాల నుంచి దిగుమతి చేసుకుంటూనే ఉన్నది. ఇప్పుడైతే అమెరికా నుంచే ఎక్కువగా ఈ దిగుమతులు జరుగుతున్నాయి.
చివరకు పాకిస్తాన్ కూడా రక్షణ ఎగుమతుల రంగంలో మెరుగైన స్థాయిలో ఉందని ఎయిర్ మార్షల్ బార్బొరా పేర్కొన్నారు. హిందుస్థాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్ (హెచ్ఎఎల్) వంటి రక్షణ రంగ పిఎస్ యులు యూరోపియన్ ఎయిర్ బస్ విమానాల కోసం తలుపులు, అండర్ క్యారేజీలను ఉత్పత్తి చేయడంలో 'సంతుష్టి' చెందుతుండగా చైనా ఎన్నో అడుగులు ముందుకు వెళ్ళిందని ఆయన చెప్పారు.
ఐఎఎఫ్ వైస్ చీఫ్ అక్కడితో ఆగిపోలేదు. చైనా ప్రావీణ్యం సంపాదించినట్లుగా సైనిక టెక్నాలజీలలో 'రివర్స్ ఇంజనీరింగ్' కళను నేర్చుకుని, లాభం పొందేందుకు ప్రయత్నించాలని ప్రైవేట్ సంస్థలను ఆయన కోరారు. 'మీరు చేస్తున్నదేమిటి అని చైనాను అడిగే ధైర్యం ఎవరికైనా ఉందా? లేదు. ఎవరూ పట్టించుకోరు. మీకుగా మీరు ఆ పని చేయలేకపోతే కనీసం రివర్స్ ఇంజనీరింగ్ ఎలా చేయాలో తెలుసుకోండి' అని బార్బొరా అన్నారు.
Pages: -1- -2- 3 News Posted: 20 November, 2009
|