సుష్మా తెచ్చిన తంటా ప్రణబ్ తన శాంతాన్ని కోల్పోతుండడం గురించి ప్రశ్నకు సమాధానంగా ఆమె ఈ వ్యాఖ్య చేశారు. నిత్యావసర వస్తువుల ధరల పెరుగుదలపై రాజ్యసభలో చర్చ జరుగుతుండగా ఒక దశలో ప్రణబ్ ఆగ్రహాన్ని ప్రదర్శించారు. కాగా, సుష్మా వ్యాఖ్య బిజెపిలో, సంఘ్ లో అద్వానీ వంటి నాయకుల గురించిన ప్రశ్నలకు ఆస్కారం కలిగించింది. సంఘ్ ప్రస్తుత అధిపతి మోహన్ భాగవత్ 50 దశకంలో ఉన్నారు. కాని ప్రణబ్ కన్నా వయస్సులో పెద్దవారే సాధారణంగా ఆ సంస్థకు సారథ్యం వహిస్తుంటారు.
అయితే, తన పార్టీలో నాయకుడు (అద్వానీ) ఆగ్రహం తెచ్చుకోరని, ముఖర్జీ వలె ఎప్పుడూ స్పందించలేదని సుష్మా ఆ వెంటనే వాదించారు. ప్రశ్నలను ఎదుర్కొనకపోవడమే ముఖర్జీ సామర్థ్యమని ఆమె అన్నారు.
కాగా, సుష్మా వ్యాఖ్యకు స్పందించవలసిన అగత్యం లేదని కాంగ్రెస్ అధికార ప్రతినిధి అభిషేక్ సింఘ్వి అన్నారు. కాని మీడియా గుచ్చి గుచ్చి ప్రశ్నించగా సింఘ్వి సమాధానం ఇస్తూ, 'ప్రణబ్ బాబు వయస్సు గురించి మాట్లాడడం సబబుగా లేదు. ఆమె ఇలా అని ఉండవలసింది కాదు. ఆమె పార్టీలో ఎవరి వయస్సు ఎంతో మాకు తెలుసు. ఇది నాటు వ్యాఖ్య' అని పేర్కొన్నారు.
ప్రణబ్ ముఖర్జీ వ్యాఖ్యలలో కొన్ని కొందరికి అసంతుష్టి కలిగించి ఉండవచ్చునని, కాని ఆర్థిక శాఖ మంత్రి ఎప్పుడూ శాంతం కోల్పోతుంటారని అనడం తప్పని సింఘ్వి అభిప్రాయం వెలిబుచ్చారు. 'ఆయన లోక్ సభ నాయకుడు, మంత్రులందరిలోకి సీనియర్. అత్యంత అనుభవజ్ఞుడు' అని సింఘ్వి పేర్కొన్నారు.
Pages: -1- 2 -3- News Posted: 2 December, 2009
|