సుష్మా తెచ్చిన తంటా కాగా, ఏ ఇతర రాజకీయ నాయకుని కన్నా ఎక్కువగా రాజకీయపరమైన, పాలనాపరమైన భారాన్ని ప్రణబ్ తన భుజస్కందాలపై మోస్తుంటారు. కాంగ్రెస్ పార్టీని, ప్రభుత్వాన్ని చిక్కుల్లో నుంచి బయటపడవేసే ప్రధాన బాధ్యతను నిర్వర్తించడమే కాకుండా డజన్ల కొద్దీ సంక్లిష్ట సమస్యలపై మంత్రుల బృందాలకు (జిఒఎంలకు) ఆయన సారథ్యం వహిస్తున్నారు.
మంత్రివర్గ సమావేశాలలో ప్రధానికి బదులుగా ఎక్కువగా మాట్లాడేది ముఖర్జీయేనని సీనియర్ మంత్రి ఒకరు వెల్లడించారు. ఇక విదేశాంగ మంత్రి గాను, రక్షణ మంత్రిగాను ఆయన వ్యవహరించినప్పుడు అసలు ఏ వివాదాలూ చోటు చేసుకోలేదు.
అయితే, పొరపాట్ల విషయమై ప్రణబ్ ముఖర్జీ ఒక్కొక్కసారి అసహనానికి గురవుతుంటారని, చివరకు కాంగ్రెస్ కార్యవర్గం, మంత్రివర్గ సమావేశాలలో కూడా సీనియర్ నాయకులకు ఆ విషయం స్పష్టం చేస్తుంటారని కాంగ్రెస్ సభ్యులు అంగీకరిస్తున్నారు. కాని, ఆయన తత్వమే ఇదని, దీనిని ఆయన వయస్సుతో ముడిపెట్టడం అన్యాయమని వారంటున్నారు.
ఇప్పుడు 85 ఏళ్ల వాడైన అటల్ బిహారి వాజపేయి ఐదున్నరేళ్ల క్రితం ప్రధానిగా ఉన్నప్పుడు ఆరోగ్యం విషయంలో ప్రణబ్ ముఖర్జీ కన్నా తీసికట్టే. ఇప్పుడు 79 ఏళ్లవాడైన జార్జి ఫెర్నాండెజ్ ఎన్ డిఎ ప్రభుత్వంలో మరొక కీలక నేత.
ఇక ప్రస్తుత మంత్రివర్గంలో విదేశాంగ శాఖ మంత్రిగా ప్రణబ్ స్థానంలో బాధ్యతలు నిర్వహిస్తున్న ఎస్.ఎం. కృష్ణ వయస్సు 77. పూర్వపు మంత్రివర్గంలో సభ్యుడైన అర్జున్ సింగ్ వయస్సు 79. ప్రధాని డాక్టర్ మన్మోహన్ సింగ్ (77) కూడా ప్రణబ్ కన్నా వయస్సులో పెద్ద. కాంగ్రెస్ ఆర్థిక వ్యవహారాలు చూస్తుండే మోతీలాల్ వోరా వయస్సు 81. వీటిని పరిగణనలోకి తీసుకుంటే ప్రణబ్ ముఖర్జీ ఎంతో మెరుగని పేర్కొనవచ్చు.
Pages: -1- -2- 3 News Posted: 2 December, 2009
|