దటీజ్ కేటీఆర్!
రాష్ట్ర రాజకీయ రంగంలో గల మరొక యువకుని - వై.ఎస్. జగన్మోహన్ పంథాతో దీనిని పోల్చి చూస్తే వైవిధ్యం కొట్టవచ్చినట్లు కనిపిస్తుంది. తన తండ్రి వై.ఎస్. రాజశేఖరరెడ్డి హెలికాప్టర్ దుర్ఘటనలో మరణించిన తరువాత ముఖ్యమంత్రి పదవిపై కన్నువేసిన జగన్ ఆ పదవిలో కొణిజేటి రోశయ్యను ప్రతిష్ఠించిన తరువాత తన ప్రత్యర్థులపై ధ్వజం ఎత్తారు. 38 సంవత్సరాల జగన్ తన వ్యతిరేకులపై విమర్శనాస్త్రాలు సంధించారు. కాని కాంగ్రెస్ అధిష్ఠానవర్గం పట్టు వీడలేదు. జగన్ కు రాజకీయ ప్రావీణ్యం లేదని పార్టీ పరిశీలకుడు ఒకరు వ్యాఖ్యానించారు. 'ఏమాత్రం శ్రమ పడకుండానే తన తండ్రికి వారసుడిని కాగలనని ఆయన భావించారు' అని ఆ పరిశీలకుడు పేర్కొన్నారు.
టిఆర్ఎస్ లో అధికార పోరులో తన బంధువు టి. హరీష్ రావుపై రామారావు పైచేయి సాధించారని రాష్ట్ర రాజకీయ పరిశీలకులు అంటున్నారు. 2009 శాసనసభ ఎన్నికలలో కరీంనగర్ జిల్లా సిరిసిల్ల నుంచి పోటీ చేసి కేవలం 171 ఓట్ల తేడాతో ఎన్నికైన రామారావు పార్టీ యంత్రాంగంలో తన స్థానాన్ని సుస్థిరం చేసుకున్నారని వారు చెప్పారు. రామారావు ఎంత పరిణత చెందారో సూచించడానికి ఒకే ఒక్క వ్యాఖ్య చాలు. ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు ప్రక్రియను ప్రారంభించగలనని కేంద్రం బుధవారం అర్ధరాత్రి ప్రకటించినప్పుడు టిఆర్ఎస్ మద్దతుదారులు అనేక మంది వేడుకలు జరుపుకోగా, పార్లమెంట్ లో బిల్లు తీసుకురావడమే 'నిజమైన కృషి' అవుతుందని రామారావు అన్నారు. అంటే ప్రత్యేక రాష్ట్ర ప్రతిపత్తి కోసం రాష్ట్ర శాసనసభ తీర్మానంపై కేంద్రం చర్య తీసుకోకుండా ఏదీ అడ్డుపడజాలదని ఆయన నర్మగర్భంగా అన్నారు.
కాగా, రామారావు సోదరి కె. కవిత (31) మెరుగైన అధికార ప్రతినిధి అని టిఆర్ఎస్ నాయకులు కొందరు అంటున్నారు. మహబూబ్ నగర్ పార్లమెంటరీ నియోజకవర్గంలో చంద్రశేఖరరావు తరఫున ఆమె చురుకుగా ప్రచారం సాగించి కొత్త సీటు నుంచి ఆయన ఎన్నికకు దోహదం చేశారని కూడా వారు గుర్తు చేశారు. రామారావుకు తన పరిమితులేవో తెలుసు. కాని ఆత్రపడిపోయే జగన్ వలె కాకుండా ఆయన నిరీక్షించడానికి సిద్ధపడ్డారు. 'ఒక కుమారుడు లోపల ఉన్నారు. మరొకరు బయట ఉన్నారు' అని ఒక విశ్లేషకుడు అన్నారు. 'ఫ్రేమ్ వెలుపల' అని ఆయన ఆంతర్యం కావచ్చు.
Pages: -1- 2 News Posted: 11 December, 2009
|