ముచ్చటగా మూడో వాయిదా? అసెంబ్లీ సమావేశాలను ముగించవలసిందని, సామరస్యపూర్వక పరిష్కారం కనుగొనేందుకు సంబంధిత నాయకులు అందరికీ తగినంత వ్యవధి ఇవ్వవలసిందని సూచిస్తూ కాంగ్రెస్ అధిష్ఠాన వర్గం దూతల ద్వారా ఒక సందేశం పంపింది. 'అన్ని వర్గాల వారికి ఆమోదయోగ్యమైన పరిష్కారానికి మేము సాయంత్రానికల్లా వస్తాం' అని రక్షణ శాఖ మంత్రి, కాంగ్రెస్ కోర్ కమిటీ సభ్యుడు ఎ.కె. ఆంటోనీ చెప్పారు.
ఎఐసిసి ప్రధాన కార్యదర్శి, రాష్ట్ర వ్యవహారాల ఇన్ చార్జి వీరప్ప మొయిలీ రాష్ట్రంలో నాయకత్వం మార్చే ప్రసక్తే లేదని స్పష్టం చేశారు. 'ముఖ్యమంత్రి కె. రోశయ్యను మార్చే ప్రతిపాదన ఏదీ లేదు' అని మొయిలీ చెప్పారు.
అయితే, శాసనసభను వాయిదా వేయడం తెలంగాణ రాష్ట్ర సమితి (టిఆర్ఎస్) ఆశలపై నీళ్లు చిలకరించినట్లే అయింది. తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం ఏర్పాటు ప్రక్రియను కేంద్రం ప్రారంభించగలదని కేంద్ర హోమ్ శాఖ మంత్రి పి. చిదంబరం బుధవారం ప్రకటించిన తరువాత రాష్ట్ర ప్రతిపత్తి కోసం తీర్మానాన్ని ప్రస్తుత సమావేశాలలోనే ఆమోదింపచేయిస్తారని టిఆర్ఎస్ ఆశించింది. 'మేము ఇలా జరుగుతుందని ఊహించలేదు. కాని మరొకసారి ఆశ్చర్యకరమైన పరిణామానికి సిద్ధంగా ఉన్నాం' అని అసెంబ్లీలోని టిఆర్ఎస్ నాయకుడు ఈటెల రాజేందర్ చెప్పారు. తీర్మానంపై సహకరించవలసిందిగా కాంగ్రెస్, తెలుగు దేశం పార్టీ (టిడిపి) సభ్యులకు ఆయన విజ్ఞప్తి చేశారు. తెలంగాణపై తీర్మానాన్ని బలపరుస్తామని కాంగ్రెస్, టిడిపి లోగడ వాగ్దానం చేసిన విషయాన్ని ఆయన వారికి గుర్తు చేశారు.
కాగా, తెలంగాణ వివాదం తలెత్తినప్పుడల్లా శాసనసభను అర్ధంతరంగా వాయిదా వేయడం రాష్ట్ర శాసనసభ చరిత్రలో ఇది మూడవ సారి. 1969లో తెలంగాణ ఉద్యమం నానాటికీ ఉద్ధృతరూపం దాలుస్తుండడంతో ప్రత్యేక రాష్ట్ర ఆందోళనకారులు సభను వాయిదా వేయించారు. ఆ రాజకీయ సంక్షోభం పర్యవసానంగా కాసు బ్రహ్మానందరెడ్డి ప్రభుత్వం పతనం కాగా పి.వి. నరసింహారావు ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించారు. 1972లో కోస్తా ఆంధ్ర, రాయలసీమ నాయకులు జై ఆంధ్ర ఉద్యమాన్ని ప్రారంభించిన కారణంగా సభను వాయిదా వేయవలసి వచ్చింది. ఆతరువాత నరసింహారావు ప్రభుత్వం పడిపోయింది.
Pages: -1- 2 -3- News Posted: 15 December, 2009
|