ముచ్చటగా మూడో వాయిదా? 1969, 1972 సంవత్సరాలలో రాజకీయ సంకల్పం లేదా దృఢచిత్తం గల నాయకత్వం కొరవడిన కారణంగా తెలంగాణ ఏర్పాటుకు గండి పడింది. తెలంగాణ ప్రజా సమితిని స్థాపించి, 1969 ఉద్యమానికి సారథ్యం వహించిన డాక్టర్ మర్రి చెన్నారెడ్డి ఆతరువాత సంవత్సరాలలో ఇందిరా గాంధి నేతృత్వంలోని కాంగ్రెస్ పార్టీలో చేరిపోయారు. దీనితో ప్రత్యేక రాష్ట్ర ప్రతిపత్తి అంశం మరుగుపడిపోయింది. నిరాశా నిస్పృహలు చెందిన తెలంగాణ మద్దతుదారులు తమ లక్ష్యం సాధనకై మావోయిస్టుల జోక్యాన్ని అర్థించారు.
అయితే, ఈ పర్యాయం శాసనసభ్యులు పార్టీలతో నిమిత్తం లేకుండా ఒకే బాటన సాగారు. వారు తమ అలవాటు ప్రకారం తమ తమ పార్టీల అధినేతలకు కాకుండా నేరుగా స్పీకర్ కో తమ రాజీనామా లేఖలను పంపడమే కాకుండా జిల్లాలలోని పట్టణాలలో ర్యాలీలు, ధర్నాలను కలిసే నిర్వహించారు. కొన్ని నెలల క్రితం ఎన్నికల సమయంలో ఆ పట్టణాలలోనే వారు పరస్పరం పోటీ పడ్డారు.
ఇది ఇలా ఉండగా, తెలంగాణ కాంగ్రెస్ శాసనసభ్యులు సోమవారం మధ్యాహ్నం భోజన సమయంలో హైదరాబాద్ నగరంలోని ఒక హోటల్ లో సమావేశమై బుధవారం ఒక సమ్మేళనాన్ని నిర్వహించాలని నిర్ణయించుకున్నారు. 'తరువాత ఒక రోజు విజయోత్సవ ర్యాలీ నిర్వహించాలనే ఆలోచనకూడా మాకు ఉంది' అని తెలంగాణ ప్రాంత మాజీ మంత్రి దామోదరరెడ్డి చెప్పారు.
Pages: -1- -2- 3 News Posted: 15 December, 2009
|