మమత ఓటు సమైక్యాంధ్రకే! తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం ఏర్పాటు ప్రక్రియను ఆంధ్ర ప్రదేశ్ శాసనసభ ప్రారంభించగలదని కేంద్ర హోమ్ శాఖ మంత్రి పి. చిదంబరం క్రితం వారం అర్ధరాత్రి ప్రకటన చేయడానికి ముందు తమను ఎందుకు సంప్రదించలేదని మూడు మిత్ర పక్షాలూ ప్రశ్నించినట్లు ఆ వర్గాలు తెలిపాయి. ఆంధ్ర ప్రదేశ్ లో పరిస్థితులు 'అదుపు తప్పిపోయిన' తరువాత తమ అభిప్రాయాలను ప్రభుత్వం ఎందుకు కోరడం లేదని కూడా ఆ పార్టీల నాయకులు ప్రశ్నించారు. ఆంధ్ర ప్రదేశ్ లో తెలంగాణ ఏర్పాటును వ్యతిరేకించే 130 మందికి పైగా శాసనసభ్యులు ఆ ప్రకటనకు నిరసనగా రాజీనామా చేసిన సంగతి విదితమే.
వ్యవసాయ మంత్రిత్వశాఖలో తన బాధ్యతను సమర్థంగా నిర్వహించలేకపోయినందుకు విమర్శలకు గురవుతున్న శరద్ పవార్ ఈ విషయంలో 'సరిగ్గా వ్యవహరించనందుకు కాంగ్రెస్ పార్టీపై విరుచుకుపడ్డారు. ఈ ఊబిలో నుంచి బయటపడే మార్గంగా కాంగ్రెస్ భావిస్తున్న రెండవ రాష్ట్ర పునర్వ్యవస్థీకరణ కమిషన్ (ఎస్ఆర్ సి) ఏర్పాటు ప్రతిపాదన కూడా మమత ప్రభృతుల ప్రతిఘటన వల్ల వెనుకకు వెళ్ళిందని ఆ వర్గాలు తెలిపాయి. సిసిపిఎ సమావేశానికి హాజరైన వారిలో ఆర్థిక శాఖ మంత్రి ప్రణబ్ ముఖర్జీ, హోమ్ శాఖ మంత్రి పి. చిదంబరం, విదేశాంగ శాఖ మంత్రి ఎస్.ఎం. కృష్ణ కూడా ఉన్నారు.
మంగళవారం ఉదయం లోక్ సభలో స్వర్గీయ రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి డాక్టర్ వై.ఎస్. రాజశేఖరరెడ్డి కుమారుడు జగన్మోహన్ రెడ్డి, ఇతర తెలంగాణేతర ఎంపిలు రాష్ట్ర విభజనను వ్యతిరేకిస్తూ తెలుగు దేశం పార్టీ (టిడిపి) సభ్యుల చెంత చేరినప్పుడు ప్రాంతీయ స్పర్థలు బయటపడ్డాయి. తెలంగాణకు చెందిన కాంగ్రెస్ ఎంపిలు ప్రత్యేక రాష్ట్రానికి అనుకూలంగా నినాదాలు చేయగా తెలంగాణ వ్యతిరేక సభ్యులు 'సమైక్య ఆంధ్ర ప్రదేశ్ నే మేము కోరుకుంటున్నాం' అని రాసని ప్లకార్డులను చేతుల్లో పట్టుకున్నారు. జగన్మోహన్ కూడా ఒక టిడిపి ఎంపి నుంచి ఒక ప్లకార్డ్ తీసుకుని ప్రదర్శించారు.
Pages: -1- 2 -3- News Posted: 16 December, 2009
|