మమత ఓటు సమైక్యాంధ్రకే! తన తండ్రి మరణానంతరం రాష్ట్రానికి తనను ముఖ్యమంత్రిని చేయడానికి కాంగ్రెస్ అధిష్ఠాన వర్గం నిరాకరించినందున ఇప్పుడీ చర్యతో జగన్ జనాదరణ స్థాయి బాగా పెరిగి ఉంటుందని రాష్ట్రంలో విశ్లేషకులు అంటున్నారు. 'సమైక్య ఆంధ్ర గురించి మా తండ్రి కన్న కలకే నేను బద్ధుడినై ఉన్నాను' అని జగన్ ఆతరువాత విలేఖరులతో చెప్పారు. కాగా జగన్ పై చర్య తీసుకోవలసిందిగా తెలంగాణ ప్రాంతానికి చెందిన కాంగ్రెస్ ఎంపిలు రక్షణ శాఖ మంత్రి, పార్టీ క్రమశిక్షణ కమిటీ అధిపతి ఎ.కె. ఆంటోనీకి విజ్ఞప్తి చేశారు. 'తనకు ముఖ్యమంత్రి అయ్యే అవకాశం తప్పించినందుకు ఆయన కాంగ్రెస్ అధిష్ఠాన వర్గంపై అసంతుష్టి చెందారు' అని తెలంగాణకు చెందిన కాంగ్రెస్ ఎంపి మధు గౌడ్ యాష్కి పేర్కొన్నారు.
జగన్, ఆయన 'విధేయులు' కేంద్రాన్ని, కాంగ్రెస్ ను ఇరకాటంలోకి నెట్టడానికి 'ఈ నాటకం నడిపించార'ని తాము విశ్వసిస్తున్నట్లు ఆంధ్ర కాంగ్రెస్ లోని కొన్ని వర్గాలు చెప్పాయి. కేంద్ర హోమ్ శాఖ మంత్రి చేసిన ప్రకటన స్ఫూర్తికి ఇది పూర్తిగా విరుద్ధమైనది. కాంగ్రెస్ అధిష్ఠాన వర్గాన్ని కూడా వ్యతిరేకించడమే అవుతుంది' అని పార్టీ ఎంపి సర్వే సత్యనారాయణ రాష్ట్రంలో విలేఖరుల వద్ద వ్యాఖ్యానించారు.
చివరకు వైఎస్ఆర్ కుటుంబానికి సన్నిహిత మిత్రుడు, నీటిపారుదల శాఖ మంత్రి పొన్నాల లక్ష్మయ్య కూడా జగన్మోహన్ రెడ్డిని విమర్శించారు. 'జగన్ ఈవిధంగా ఒక పక్షానికి అనుకూలంగా వ్యవహరిస్తారు' అని లక్ష్మయ్య ప్రశ్నించారు. 'తన తండ్రి వలె ఆయన కూడా ఈ ప్రాంతీయ సెంటిమెంట్లకు దూరంగా ఉండవలసింది' అని లక్ష్మయ్య అన్నారు. కాగా, తన పార్టీ నిరసనలు 'సమైక్యతను కోరుకుంటున్న జనాభిప్రాయానికి స్పందనే' అని టిడిపి చీఫ్ విప్ ఎం. శివప్రసాద్ చెప్పారు. 'ప్రస్తుతం ఏ పార్టీ లేదు. టిడిపిలో లేదా కాంగ్రెస్ లో అధిష్ఠానం అనేదే లేదు. ఆంధ్ర ప్రదేశ్ ను కుదించే ప్రతిపాదనకు వ్యతిరేకంగా ఉన్నదనే కారణంగా జనం నాడిని పసిగట్టడంలో మా నాయకులు విఫలురయ్యారు. ప్రత్యేక రాష్ట్రం ఏర్పాటు ప్రక్రియ ప్రారంభమైతే జనం సహించరు' అని శివప్రసాద్ అన్నారు.
ఇది ఇలా ఉండగా ప్రణబ్ ముఖర్జీ శాంతం కోల్పోయిన సంఘటన కూడా మంగళవారం లోక్ సభలో జరిగింది. రైల్వే శాఖ పద్దులపై ముందు నిర్ణయించిన ప్రకారం చర్చను పూర్తి కానివ్వవలసిందిగా స్పీకర్ విజ్ఞప్తి చేసినప్పటికీ పార్టీ సభ్యులను ముందుగా మాట్లాడనివ్వాలని టిడిపి సభ్యుడు ఒకరు పట్టుబట్టినప్పుడు ప్రణబ్ ఆగ్రహం చెందారు. స్పీకర్ ఆదేశాన్ని పాటించాలని ఆయన ఎంపిలను కోరారు. దీనితో వారిలో ఒకరు 'మీరేమంటున్నారు సార్' అని అన్నారు. ఇందుకు ఆగ్రహించిన ప్రణబ్ ముఖర్జీ 'ముందు మీరు మర్యాదలు నేర్చుకోండి' అని అన్నారు. ఆతరువాత 'మిమ్మల్ని బయటపెడతా' అని ఆయన అన్నారు.
Pages: -1- -2- 3 News Posted: 16 December, 2009
|