కొందరికే ఉద్యమాసక్తేల?
అంతేకాకుండా విశ్వవిద్యాలయ క్యాంపస్ లను సముజ్వలమైన రాజకీయ జీవితానికి మెట్లుగా సియుల విద్యార్థులు భావిస్తుంటారు. 'క్యాంపస్ లో రాజకీయ కార్యకలాపాలను చురుకుగా నిర్వహించిన విద్యార్థుల తరువాత ఉన్నత రాజకీయ నాయకులైన సందర్భాలు గతంలో అనేకం ఉన్నాయి. ఉదాహరణకు చంద్రబాబు నాయుడు, వెంకయ్య నాయుడు జై ఆంధ్ర ఉద్యమంలో చురుకుగా పాల్గొన్నారు. 1969 తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్న జైపాల్ రెడ్డి, మల్లికార్జున్ వంటి ఒయు విద్యార్థులు జాతీయ స్థాయికి ఎదిగారు. చివరకు ప్రస్తుత రాష్ట్ర మంత్రులు శ్రీధర్ బాబు, ముఖేష్ గౌడ్, డి. రాజనరసింహ, కరీంనగర్ ఎంపి పొన్నం ప్రభాకర్ కూడా ఒయు నుంచి వచ్చినవారే. వారు విద్యార్థి ఉద్యమాలలో సంబంధాలు ఉన్నవారే' అని పేరు వెల్లడికి ఇష్టపడని ప్రొఫెసర్ ఒకరు చెప్పారు.
అంతే కాదు. విశ్వవిద్యాలయ క్యాంపస్ లలోని విద్యార్థుల మద్దతు సమీకరించడం రాజకీయ పార్టీలకు తేలిక. 'మనకు అధిక సంఖ్యలో కాలేజీలు, ఇతర విద్యా సంస్థలు ఉన్నప్పటికీ తమ బలాన్ని ఆ సంస్థలకు విస్తరించడానికి రాజకీయ పార్టీలకు తేలిక కాదు. ఎందుకంటే ఆ విద్యా సంస్థలు చెల్లా చెదురైనట్లుగా వివిధ ప్రాంతాలలో ఉంటాయి. అవి ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు పని చేస్తుంటాయి. క్లాసులు ముగిసిన తరువాత విద్యార్థులు ఎవరి ఇళ్ళకు వారు వెళ్ళిపోతారు. కాని విశ్వవిద్యాలయం క్యాంపస్ లో వేలాది మంది విద్యార్థులు ఒక్క చోటే ఉంటారు. రేయింబవళ్ళూ వారు అందుబాటులో ఉంటారు. పార్టీలకు తమ సిద్ధాంతాలను ప్రచారం చేయడం సులభం. అందుకే ఉద్యమాలు గాని, రాజకీయ కార్యకలాపాలు గాని మనకు కనిపించేవి క్యాంపస్ లలో తప్ప ఇతర విద్యా సంస్థలలో కాదు' అని సీనియర్ ప్రొఫెసర్ మీనాక్షి చెప్పారు.
Pages: -1- 2 News Posted: 18 December, 2009
|