రాహుల్ బాటలో గడ్కరి! 52 ఏళ్ల వయస్సులో అతి పిన్న బిజెపి అధ్యక్షుడుగా బాధ్యతలు స్వీకరించిన గడ్కరి వ్యవహరణ తీరు ఒక శకం అంతరించిందని సూచిస్తున్నది. 'ఈ తరం మార్పు చెప్పుకోదగినది కావచ్చు' అని పార్టీ అధికారి ఒకరు వ్యాఖ్యానించారు. రాహుల్ వలె గడ్కరి 'రాజకీయాలకు ఎన్ జిఒ తరహా శ్రద్ధతో మేనేజీరియల్ విధానాన్ని' సమ్మిళితం చేస్తున్నారని ఆయన పేర్కొన్నారు.
'నాకు రాజకీయాలంటే వ్యక్తిగత అజెండా లేనిది. సామాజిక, ఆర్థిక సంస్కరణలు తీసుకువచ్చేందుకు ఇది ఒక ఉపకరణం. నేను మేనేజ్ మెంట్, కామర్స్, లా గ్రాడ్యుయేట్ ను. నా వ్యాపారం కాంక్రీట్, సిమెంట్ కు సంబంధించినది అయినప్పటికీ నేను కాంక్రీట్ లో ప్రవీణుడిని కానని ఒప్పుకోవాలి' అని గడ్కరి అన్నారు. బిజెపి వోటర్ల పరిధిని విస్తరించడం, మైనారిటీలలో నమ్మకాన్ని పెంచడం, 'జట్టు స్ఫూర్తి, పరస్పర విశ్వాసం, క్రమశిక్షణ'లను పునరుద్ధరించడం వంటివి తన ప్రాధాన్యాతాంశాలుగా ఆయన ప్రకటించారు. 'నన్ను విమర్శించే హక్కు మీకు ఉందని, అయితే అది నా సమక్షంలోనే జరగాలని నా పార్టీ సహచరులతో చెప్పాను. నాకు ప్రోటోకాల్ పై విశ్వాసం లేనందున నేను వారికి నచ్చజెప్పవచ్చు లేదా నేనే వారి మాటలను విశ్వసించవచ్చు' అని గడ్కరి తెలిపారు.
క్రమశిక్షణారాహిత్యం, నాసిరకం పని తీరు తనకు నచ్చవని ఆయన స్పష్టం చేశారు. 'క్రమశిక్షణారాహిత్యం చర్చనీయం కానిది, అమలు పరిచే అంశం మాత్రమే. దానిని సహించేది లేదు' అని ఆయన చెప్పారు. 'నేను ఎప్పుడైనా ఆర్థికపరమైన ఆడిట్ కు స్వస్తి చెప్పవచ్చు. కాని పని తీరు సమీక్ష మాత్రం తప్పనిసరి' అని గడ్కరి చెప్పారు.
ఏ అంశంపైనైనా శీఘ్రంగా చర్య తీసుకోవాలనేది తన పద్ధతి అని గడ్కరి బుధవారం సాయంత్రం ఒక సందర్భంలో సోదాహరణగా నిరూపించారు. రాజస్థాన్ లో ఫ్యాక్షనలజింపై ఆయన చర్య తీసుకోవలసి వచ్చింది. ముందు వేరే కార్యక్రమాలన్నిటికీ స్వస్తి చెప్పి దీనికి 'ఒక పరిష్కారం కనుగొనవలసింది'గా అరుణ్ జైట్లీ, రాజనాథ్ సింగ్ లతో సహా సీనియర్ నాయకులను గడ్కరి కోరారు. 'ఆరేడు గంటలలో మేము ఒక పరిష్కారం కనుగొన్నాం. పంచాయతీ ఎన్నికలలో సమైక్యంగా పోటీ చేయాలని రాష్ట్ర నాయకులు తీర్మానించుకున్నారు' అని ఆయన తెలిపారు. 'అందరినీ సంతృప్తి పరిచే పరిష్కారం' వల్ల వసుంధరా రాజెతో సహా ప్రతి ఒక్కరికీ 'న్యాయం జరిగింది. వారి ఆకాంక్షలు నెరవేరాయి' అని పార్టీ వర్గాలు వివరించాయి.
Pages: -1- 2 News Posted: 25 December, 2009
|