చిన్నారులకు 'మావో' భూతం ఇక గోల్ తోరె గ్రామానికి చెందిన తొమ్మిదేళ్ల సాగున్ హన్స్ డా, అతని ఏడేళ్ల తమ్ముడు ఫాగున్ కథ కూడా ఇటువంటిదే. డిసెంబర్ 1న వారి తండ్రి ఆనంద, అతని స్నేహితుడు సత్యనారాయణ్ మావోయిస్టులకు వ్యతిరేకంగా గిరిజనులను సంఘటితపరిచే విధం గురించి ఇంటిలో సమావేశం నిర్వహిస్తున్నారు. హఠాత్తుగా గెరిల్లాల బృందం ఇంటిలోకి చొరబడి సత్యనారాయణ్ ను కాల్చి చంపి, ఆనందను కొట్టి, ఒక పలుగుతో తొడలో గుచ్చారు. పిల్లలిద్దరూ నిస్సహాయంగా ఈ ఘాతుకాన్ని తిలకించారు. ఉత్సాహంతో ఆడుకుంటుండే ఆ పిల్లలిద్దరి ప్రవర్తన ఆతరువాత మారిపోయింది. వారు స్కూలుకు వెళ్లడానికి గాని, స్నేహితులతో కలవడానికి గాని నిరాకరిస్తున్నారు. అన్నదమ్ములిద్దరూ ఎప్పుడూ 'బెదరు చూపులు చూస్తుంటారు' అని వారి నానమ్మ 70 ఏళ్ల బార్గీ తెలియజేసింది. 'సాయంత్రం అవుతుంటే హంతకులు తిరిగి వస్తారేమోననే భయంతో తలుపులు వేసి ఉంచవలసిందని నా మనవలిద్దరూ పట్టుబట్టుతుంటారు' అని ఆమె చెప్పింది.
'భయంతో కూడిన మనస్తత్వమే' ఈ రకం ప్రవర్తనకు కారణమని కోలకతాకు చెందిన సైకియాట్రిస్ట్ రమదీప్ ఘోష్ రాయ్ పేర్కొన్నారు. 'పిల్లలు చూసిన హింసాత్మక సంఘటనలు వారి మనస్సులను ఛిద్రం చేశాయి. అది ఈ రకం ప్రవర్తనకు దారి తీసింది' అని ఘోష్ రాయ్ వివరించారు. లాల్ గఢ్ లో హింసాకాండ అంతమైతేనే గాని 'ఇటువంటి రుగ్మతలకు చికిత్స చేయలేము' అని ఘోష్ రాయ్ అన్నారు. పరిస్థితి మెరుగుపడినట్లయితే ఈ పిల్లల ప్రవర్తనను మార్చడానికి చికిత్స చేయాలని ఆయన సూచించారు. 'సంఘటన స్థలం నుంచి వీరిని దూరంగా తీసుకువెళ్లినప్పటికీ ప్రయోజనం ఉండదు' అని ఆయన అన్నారు.
Pages: -1- 2 News Posted: 26 December, 2009
|