ఇన్వెంటర్లకు '3 ఇడియట్స్' నిధి ఎన్ఐఎఫ్ డేటా బేస్ లో ఇప్పుడు 545 జిల్లాల నుంచి 1.4 లక్షల ఇన్వెన్షన్లు ఉన్నాయి. ఇండియాలో 220 పేటెంట్ దరఖాస్తులు, అమెరికాలో ఒక పేటెంట్ దరఖాస్తును ఈ సంస్థ అందజేసింది.
'ఎన్నో వినూత్న సాధనాలు ఇప్పుడు మార్కెట్ కు వెళుతున్నాయి' అని ఎన్ఐఎఫ్ చీఫ్ ఇన్నోవేషన్ ఆఫీసర్ విపిన్ కుమార్ తెలియజేశారు. ఆయనకు మంగళవారం చోప్రా యూనిట్ నుంచి ఒక కాల్ వచ్చింది. '50 టెక్నాలజీలను కంపెనీలకు బదలాయించడమైనది. శోధకులకు రాయల్టీలు వస్తున్నాయి. కొందరికి అమ్మకాలపై 5 శాతం వరకు రాయల్టీ లభిస్తున్నది' అని విపిన్ కుమార్ తెలిపారు.
ఆ శోధకుల (ఇన్వెంటర్ల) యంత్రాలు చోప్రా చిత్రంలో ప్రస్తావించారు. చిత్రంలో ప్రధాన పాత్ర 'రాంచో' అననుకూల పరిస్థితులలో సృష్టించిన 'చుట్జ్ పా' గడచిన ఆరు రోజులుగా దేశంలో సినీ అభిమానులను విశేషంగా ఆకట్టుకుంటున్నది. ఆ ఇన్వెంటర్ల వివరాలు ఈ దిగువన ఇవ్వడమైనది: కేరళకు చెందిన 20 ఏళ్ల విద్యార్థిని రమ్య జోస్ తన తల్లి అస్వస్థురాలై, తండ్రి క్యాన్సర్ తో బాధ పడుతున్నప్పుడు ఎక్సర్ సైకిల్ - కమ్ - వాషింగ్ మెషీన్ ను సృష్టించింది. డిస్కవరీ చానెల్ ఆమె ఇన్వెన్షన్ ను వీడియోలో చిత్రించింది. అది ఇప్పుడు యూట్యూబ్ లో హిట్ అయింది. ఇక మహారాష్ట్రకు చెందిన 49 సంవత్సరాల పెయింటింగ్ పని చేసే జహంగీర్ తన భార్య సౌకర్యార్థం స్కూటర్ శక్తితో పని చేసే పిండిమరను రూపొందించాడు. విద్యుత్ కోత పది గంటల పాటు కొనసాగుతున్నప్పుడు గోధుమలను పిండిగా చేయడానికి తన భార్య పడుతున్న అవస్థను గమనించి అతను ఈ యంత్రానికి రూపకల్పన చేశాడు.
ఉత్తర ప్రదేశ్ కు చెందిన క్షురకుడు, ఐదవ తరగతితోనే చదువుకు స్వస్తి చెప్పిన 32 సంవత్సరాల మహమ్మద్ ఇద్రిస్. సైకిల్ శక్తితో పని చేసే హార్స్ క్లిప్పర్ ను రూపొందించాడు. ఎలక్ట్రికల్ షేవర్లు దొరకని స్థితిలో మామూలుగా కన్నా సగం తక్కువ సమయంలో గుర్రాల వెంట్రుకలు కత్తిరించే యంత్రం ఇది.
Pages: -1- 2 -3- News Posted: 31 December, 2009
|