ఇన్వెంటర్లకు '3 ఇడియట్స్' నిధి భారతీయులు వినూత్న సృష్టి సామర్థ్యం కొత్తేమీ కాదు. 'జుగాడ్' అనే పదం దీనిని సుస్పష్టం చేస్తున్నది. ఇది ఆంగ్ల పదానికి అనువాదమేమీ కాదు. కాని ఒక సమస్యకు పరిష్కారం కనుగొనే సత్తాను ఇది సూచిస్తున్నది. హనీ బీ నెట్ వర్క్ దృష్టికి వచ్చిన ఇన్వెన్షన్లను 'జుగాడ్' దశను దాటి ప్రధాన వ్యాపార స్రవంతిలోకి తీసుకువచ్చే కృషిని ఎన్ఐఎఫ్ చేస్తున్నది. ఇన్వెంటర్లకు మెరుగైన శిక్షణ ఇచ్చేందుకు ఈ సమాఖ్య వైజ్ఞానిక, పారిశ్రామిక పరిశోధనా మండలి (సిఎస్ఐఆర్), భారతీయ వైద్య పరిశోధనా మండలి (ఐసిఎంఆర్) నుంచి నిపుణుల సాయం లభించేట్లు చూస్తున్నది.
ఇన్వెంటర్ల దృక్పథం, వినూత్న సృష్టిని బట్టి కొందరు జాతీయ లేబరేటరీలలో ఫెలోషిప్ లు సాధిస్తుంటారని, ఇతరులను చిన్న, మధ్య స్థాయి సంస్థల దృష్టికి తీసుకువెళుతుంటామని, అవి రాయల్టీలు, ప్రత్యేకమైన లేదా మామూలు మార్కెటింగ్ హక్కులను, లాభాలలో వాటాను, లేదా ఇన్వెన్షన్ల కొనుగోలును ఆఫర్ చేస్తుంటాయని విపిన్ కుమార్ తెలియజేశారు.
Pages: -1- -2- 3 News Posted: 31 December, 2009
|