'వైఎస్ లా పాలించలేను' అయితే, రాష్ట్ర విభజన గురించి తన మనసులో ఉన్నదేమిటో వెల్లడి చేయడానికి రోశయ్య నిరాకరించారు. అది కేంద్రం విచక్షణాధికారమని ఆయన పేర్కొన్నారు. 2010 సంవత్సరంలో రాష్ట్రం చెక్కుచెదరకుండా కొనసాగుతుందా అని జోస్యం చెప్పడానికి కూడా ఆయన నిరాకరించారు. 'ఫలానా జరుగుతుందని చెప్పేందుకు నేను జ్యోతిష్కుడిని కాను. అందువల్ల రాష్ట్రం రెండు ముక్కలవుతుందా లేక మూడు ముక్కలవుతుందా అనేది నేను ఎలా చెప్పగలను' అని రోశయ్య అన్నారు.
'పరిష్కారం నా చేతులలో లేదు' అని ఆయన చెప్పారు. 'వారు (కేంద్రం) ఆ పని చేయవలసి ఉంటుంది. శాంతియుతంగా ఉద్యమాలు నిర్వహిస్తే నాకేమీ అభ్యంతరం ఉండదు. కాని ఉద్యమం పేరిట ఆస్తులు ధ్వంసం చేయడాన్ని అనుమతించేది లేదు. అందుకే ముందు జాగ్రత్త చర్యలు తీసుకుంటున్నాం' అని సిఎం చెప్పారు. 'రాష్ట్ర ముఖ్యమంత్రిగా తాను పని చేయగలనని, అన్ని ప్రాంతాల ప్రయోజనాలను కాపాడగలనని ఆయన తెలిపారు. 'నేను ఒక ప్రాంతంలో పుట్టినా నాకు అన్ని ప్రాంతాలూ సమానమే' అని రోశయ్య చెప్పారు.
రాష్ట్రానికి నూతన సంవత్సర కానుకగా పేర్కొననడానిక ప్రత్యేక పథకం ఏదీ లేదని సిఎం చెప్పారు. 'వైఎస్ఆర్ అజెండాను నేను అమలు పరుస్తాను' అని ఆయన వాగ్దానం చేశారు. 'ఏ మౌలిక సమస్యపైనా రాజీ పడకుండానే నా విధులు నిర్వర్తిస్తా' అని రోశయ్య స్పష్టం చేశారు.
ఐఐఎం గ్రాడ్యుయేట్ ఎస్.వి. ప్రసాద్ ను ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా తాను ఎంపిక చేయడం గురించి రోశయ్య ప్రస్తావిస్తూ, వివిధ సిఎంల వద్ద ఆయన పని చేసిన అనుభవాన్ని తాను పరిగణనలోకి తీసుకుని ఈ ఎంపిక జరిపినట్లు చెప్పారు.
Pages: -1- -2- 3 News Posted: 1 January, 2010
|