ఎంత కష్టం?ఎంత నష్టం?? జివికె ఎమర్జెన్సీ మేనేజ్ మెంట్ అండ్ రీసర్చ్ ఇన్ స్టిట్యూట్ ఈ ఆత్మహత్యల గణాంకాలను అందజేసింది. గ్రామీణ, ఒక మోస్తరు పట్టణ ప్రాంతాలలో వైద్య, పోలీసు, అగ్నిమాపక అత్యవసర సర్వీసులు చూస్తుండే ప్రభుత్వ, ప్రైవేట్ భాగస్వామ్య సంస్థ ఇది. నవంబర్ 30, డిసెంబర్ 15 మధ్య రాష్ట్రంలో రికార్డు స్థాయిలో 1812 ఆత్మహత్యా యత్నం కేసులు నమోదయ్యాయని, మామూలుగా ఒక పక్షంలో నమోదయ్యే కేసులు 250కి ఇది సుమారు ఎనిమిదింతలు ఉందని సంస్థ తెలియజేసింది. హైదరాబాద్ కేంద్రంగా గల ఈ సంస్థ కంట్రోల్ రూములకు వచ్చే సిసలైన, బోగస్ ఫోన్ కాల్స్ సంఖ్య కూడా పెరిగింది.
తెలంగాణలో వరంగల్లు జిల్లాలో అత్యధికంగా 172 ఆత్మహత్యా యత్నం కేసులు నమోదయ్యాయి. 133 కేసులతో మహబూబ్ నగర్, 132 కేసులతో రంగారెడ్డి జిల్లాలు ఆతదుపరి స్థానాలలో ఉన్నాయి. కోస్తా ఆంధ్రలో శ్రీకాకుళం జిల్లాలో అతి తక్కువగా 21 కేసులు నమోదయ్యాయి. ఉద్యమ సంబంధింత గాయాలు, మరణాల సంఖ్య 41828 కాగా, హైదరాబాద్ లో ఈ సంఖ్య 1547 గాను, రంగారెడ్డిలో 2255 గాను ఉన్నాయి.
తెలంగాణ కోసం గాని, సమైక్య ఆంధ్ర కోసం గాని విద్యార్థులు, న్యాయవాదులు, ప్రభుత్వ ఉద్యోగులు వీధులలోకి వచ్చి ధర్నాలు, ర్యాలీలు, రిలే నిరాహార దీక్షలు నిర్వహిస్తుండగా, నిరుపేదలైన తల్లిదండ్రులు తమ పిల్లల భవిత గురించి అమితంగా ఆందోళన చెందుతున్నారని సాంఘిక కార్యకర్తలు చెబుతున్నారు.
ఇక ఈ ఉద్యమ ఫలితంగా జీవనానికి, పనులకు అంతరాయం కలగడంతో కూలీలు, ఫలహార శాలలు, బళ్ళ యజమానులు, చిన్నా చితక వ్యాపారులు వంటి నెల జీతం లేని వర్గాలు, మధ్యవయస్కులైన స్వయం ఉపాధి కల్పించుకున్న వారు నష్టపోతున్నారు. 'తెలంగాణ కనుక ఏర్పడినట్లయితే, మేలిమి రకం బియ్యం కర్నూలు సోనా మసూరికి మేము మరింత వెచ్చించవలసి రావచ్చు' అని హైదరాబాద్ లో రోడ్డు పక్కన ఫలహార శాల నడిపే 42 ఏళ్ల మహిళ పద్మమ్మ అన్నది.
Pages: -1- 2 -3- News Posted: 4 January, 2010
|