ఎంత కష్టం?ఎంత నష్టం?? 'మేము హైదరాబాదీలం కూరగాయలు, చింతపండు, మిర్చి, పొగాకు, పూలు, కొబ్బరి బోండాలు, ఉల్లిపాయలు వంటి ప్రతి వస్తువును రాయలసీమ నుంచి గాని, కోస్తా ఆంధ్ర నుంచి తెప్పించుకోవలసి ఉంటుంది. కొత్త రాష్ట్రం ఏర్పడినట్లయితే, ఆంక్షలు, కొత్త పన్నులు ఉండగలవు' అని నగరంలోని జనరల్ బజార్ ప్రాంతానికి చెందిన ఒక ధాన్యం వర్తకుడు గౌతు నరసింహులు అన్నారు.
సినీ ప్రముఖుడు గోవిందరావు మెల్కోటె ఈ సందర్భంగా మాట్లాడుతూ, చివరకు ఇంటి తయారీ ఊరగాయలను కూడా గుంటూరు, రాజమండ్రి నుంచి హైదరాబాద్ 'దిగుమతి' చేసుకోవలసి ఉంటుందని అన్నారు. తెలంగాణ మాంసాహార సంబంధిత డక్కన్ ఆహార పదార్థాలకు ప్రసిద్ధి చెందినప్పటికీ అత్యంత ఘాటైన తెలుగు ఆహార పదార్థాలు మాత్రం కోస్తా, రాయలసీమ ప్రాంతాలలోనే తయారవుతుంటాయి.
అసలు తెలంగాణ రాష్ట్రం అందరూ కలసి ఉండే ఆరోగ్యకరమైన వాతావరణాన్ని పెంపొందిస్తుందా అని చాలా మంది ఆందోళన చెందుతున్నారు. 'కొన్ని వర్గాలు, భూస్వాముల ఆధిపత్యం సాగిన పూర్వపు హైదరాబాద్ రాష్ట్రంలోని శక్తులు తెలంగాణ ఏర్పాటు అనంతరం తిరిగి తలెత్తవనే ఆశిస్తున్నాను' అని హైదరాబాద్ లో ఒక బహుళ జాతీయ సంస్థలో యుటిలిటీ సూపర్వైజర్ గా ఉన్న మల్లేశ్వరి దేవరకొండ చెప్పారు.
రాష్ట్రం అంతటా నెలకొన్న ఉద్రిక్త పరిస్థితుల వల్ల నూతన సంవత్సర వేడుకలు ఎప్పటి వలె ఆర్భాటంగా జరగలేదు. పోలీసులు గట్టి భద్రతా ఏర్పాట్లు చేసినప్పటికీ కొత్త సంవత్సర వేడుకలు చప్పగా సాగాయి. చాలా మంది ఐటి ప్రొఫెషనల్స్, స్థానికేతరులు డిసెంబర్ 31 రాత్రి ఇళ్ళలోనే ఉండిపోయారు. 'పరిస్థితులు ఏమీ బాగా లేవు కనుక మేము హోటళ్ళకు, క్లబ్లులకు వెళ్ళలేదు' అని కోలకతాకు చెందిన సాఫ్ట్ వేర్ ఇంజనీర్ అభిజీత్ ముఖర్జీ చెప్పారు.
Pages: -1- -2- 3 News Posted: 4 January, 2010
|