జ్ఞాపకశక్తి పెంచే సెల్ ఫోన్! ఒక గంట వ్యవధితో రోజుకు రెండు సార్ల నుంచి ఏడు నుంచి తొమ్మిది నెలల వరకు సెల్ ఫోన్ వాడినప్పుడు మనిషి మెదడు లోనయ్యే విద్యుదయస్కాంత క్షేత్ర ప్రభావానికి మామూలు ఎలుకలను, జన్యుపరంగా మార్పులు చేసిన (జిఇ) ఎలుకలను సైంటిస్టులు గురి చేశారు. ఆ తదుపరి మనుషులలో జ్ఞాపక శక్తి లోపానికి, అల్జైమర్స్ వ్యాధితో సారూప్యతకు సంబంధించిన కొన్ని పరీక్షలను ఎలుకలపై నిర్వహించారు.
జ్ఞాపకశక్తిని పెంచే, రక్షిత ప్రభావాలు రెండు రకాల ఎలుకలలో కనిపించాయి. విద్యుదయస్కాంత క్షేత్ర ప్రభావానికి ఎక్కువ కాలం గురైన మామూలు ఎలుకలు అటువంటి ప్రభావానికి గురికాని వాటికన్నా పరీక్షలలో మెరుగైన ఫలితాలను ఇచ్చాయి. అల్జైమర్స్ వ్యాధి లక్షణాలు ఉన్న వృద్ధ ఎలుకలలో ఈ ప్రభావం వల్ల వ్యాధి వ్యవస్థలో గల 'బీటా అమిలాయిడ్' అనే హానికరమైన ప్రొటీన్ డిపాజిట్లు తగ్గాయి. చిన్న వయస్సులోని ఎలుకలలో ఈ ప్రొటీన్ పేరుకుపోకుండా ఇది నివారించింది.
విద్యుదయస్కాంత క్షేత్రాల ప్రభావానికి సుదీర్ఘ కాలం గురి కావడం వల్ల వ్యాధి తగ్గుముఖం పట్టుతుందనడానికి ఇది పక్కా దాఖలా అని పరిశోధకులు పేర్కొన్నారు. ఈ ఫలితాలను 'అత్యంతాశ్చర్యకరమైనవి'గా ఆరెండాష్ అభివర్ణించారు. 'సెల్ ఫోన్ ఎక్కువ సేపు వాడడం జ్ఞాపక శక్తికి హానికరమనే సిద్ధాంతంతో మేము పరిశోధన ప్రారంభించాం' అని ఆరెండాష్ తెలిపారు. అయితే, బీటా అమిలాయిడ్ ను పరిమితం చేయడం ద్వారా ఇది రక్షణ కల్పిస్తున్నదని వారి అధ్యయనంలో వెల్లడైంది.
Pages: -1- 2 -3- News Posted: 8 January, 2010
|