జ్ఞాపకశక్తి పెంచే సెల్ ఫోన్! కాగా, 'ఎలుకలలో బీటా అమిలాయిడ్ లో మార్పులు ఈ ఫలితాల ప్రాముఖ్యతను నొక్కి చెబుతున్నాయి' అని బెంగళూరులోని జాతీయ మానసిక ఆరోగ్య, న్యూరోసైన్సెస్ ఇన్ స్టిట్యూట్ కు చెందిన అదనపు ప్రొఫెసర్ బిందు కుట్టి పేర్కొన్నారు. ఈ అధ్యయనంలో ఆమె పాల్గొనలేదు. 'అయితే, మనుషులలోఅల్జైమర్స్ వ్యాధి ఎంతో సంక్లిష్టమైనదని మనం గుర్తుంచుకోవలసి ఉంటుంది. మనం ఇప్పుడు ఉపయోగిస్తున్న జంతు మోడల్స్ మనుషుల పేథాలజీని ప్రతిబింబించవు' అని బిందు కుట్టి పేర్కొన్నారు.
ఈ అధ్యయనంలో ఎలుకలను పూర్తి శరీరంతో విద్యుదయస్కాంత క్షేత్ర ప్రభావానికి గురి చేశామని, సెల్ ఫోన్ వాడకం సమయంలో మనుషులకు తల భాగం మాత్రమే దీని ప్రభావానికి లోనవుతుంటుందని ఆరెండాష్, ఆయన సహచరులు కూడా తెలిపారు. ఎలుకల పుర్రెల ద్వారా విద్యుదయస్కాంత క్షేత్రాలు ప్రవేశించడం మనుషులు పుర్రెలలలో వలె జరుగుతుందా అనేది ఇంకా తెలియదని కూడా వారు చెప్పారు.
ప్రపంచ ఆరోగ్య సంస్థ (హూ), ఇతర ఆరోగ్య సంస్థలు గతంలో సెల్ ఫోన్ ప్రభావంపై అనేక అధ్యయనాలు నిర్వహించాయి. వయోజనులకు గాని, పిల్లలకు గాని ఆరోగ్యానికి హాని కలుగుతున్నట్లు దాఖలాలు కనిపించలేదని అవి తెలియజేశాయి. అయితే, విద్యుదయస్కాంత క్షేత్రాల ప్రభావం వల్ల ఆక్సీకరణ ఒత్తిడి అనే ప్రక్రియ ద్వారా అవయవాలకు హాని కలగవచ్చునని కొన్ని జంతువులపై జరిపిన అధ్యయనాలు సూచించాయి.
Pages: -1- -2- 3 News Posted: 8 January, 2010
|