సైన్యం 'అలర్ట్' : ఆంటోని రాష్ట్ర ముఖ్యమంత్రి ఒమర్ అబ్దుల్లా, ఉప ముఖ్యమంత్రి తారా చంద్, సైనిక దళాల ప్రధానాధికారి జనరల్ దీపక్ కపూర్, రక్షణ శాఖ కార్యదర్శి ప్రదీప్ కుమార్, రక్షణ మంత్రిత్వశాఖ అధికారులు, సైనిక దళ ప్రధాన కార్యాలయం నుంచి కమాండర్లు, రాష్ట్ర ప్రభుత్వ సీనియర్ అధికారులు, వివిధ భద్రత, ఇంటలిజెన్స్ సంస్థల అధికారులు ఈ సమావేశానికి హాజరైనట్లు శ్రీనగర్ లో విడుదలైన ఒక అధికార ప్రకటన ద్వారా తెలియవచ్చింది.
'భద్రత పరిస్థితి మెరుగుపడడంతో రాష్ట్ర పోలీసులకు మరింత బాధ్యత ఇవ్వవలసిన తరుణం వచ్చింది. ముఖ్యంగా రాష్ట్రంలోని ప్రధాన పట్టణాలలో టెర్రరిజం బెడదను అరికట్టడంలో వారు గురుతర బాధ్యత వహించాలి. అయితే, ఈ బాధ్యతల అప్పగింత పక్కా వ్యూహంతో, క్రమ పద్ధతిలో జరగాలి' అని ఆంటోనీ సూచించినట్లు ఆ అధికార ప్రకటన తెలియజేసింది.
రక్షణ మంత్రిత్వశాఖ విజ్ఞప్తిపై హోమ్ మంత్రిత్వశాఖ 2010 జనవరి 15 నుంచి జమ్ము - శ్రీనగర్ జాతీయ రహదారిలో రోడ్లను రాకపోకలకు తెరిచే బాధ్యతను స్వీకరించవలసిందిగా సిఆర్ పిఎఫ్ కు ఆదేశాలు జారీ చేసిందని ఆయన వెల్లడించారు. 'మన టెర్రరిస్టుల నిరోధక పథకాన్ని ఏమాత్రం నీర్చుకార్చకుండానే సైన్యం ప్రమేయాన్ని తగ్గించేందుకు ఈ అప్పగింత జరుగుతోంది' అని ఆయన వివరించారు. అన్ని కేంద్ర పోలీస్ సంస్థలు, రాష్ట్ర పోలీసులు యుద్ధ దుస్తులు (యూనిఫామ్) ధరించడానికి స్వస్తి చెప్పవలసిందని ఉత్తర్వులు జారీ చేయవలసిందిగా హోమ్ మంత్రిత్వశాఖకు ఒక అభ్యర్థన పత్రాన్ని పంపినట్లు కూడా ఆంటోనీ తెలిపారు.
Pages: -1- 2 -3- News Posted: 13 January, 2010
|