సైన్యం 'అలర్ట్' : ఆంటోని ఇది ఇలా ఉండగా, సాయుధ దళాల సిబ్బంది మానవ హక్కులు ఉల్లంఘించడాన్ని 'ఏమాత్రం సహించరాదనేది' ప్రభుత్వ విధానమని రక్షణ మంత్రి పునరుద్ఘాటించారు. 'మన సాయుధ దళాలు సర్వకాల సర్వావస్థలలోను మానవ హక్కులను మన్నించాలనేది గుర్తెరిగి ఉండాలి. వారు తమ బాధ్యతల నిర్వహణ సమయంలో 'కనీస బల ప్రయోగం', 'నమ్మకం' అనే జంట నైతిక సూత్రాలను పాటించాలి. భద్రతా దళాలకు గల పరిమితులు అర్థం చేసుకోదగినవే అయినప్పటికీ, ప్రజల హృదయాలను చూరగొనే ప్రక్రియ ఎన్నడూ తేలిక కాదని భద్రతా దళాలు జ్ఞాపకం ఉంచుకోవాలి' అని ఆంటోనీ కోరారు. 'భద్రత వాతావరణం పరంగా 2009 మనకు మెరుగైన సంవత్సరం. 2010 సరైన రీతిలోనే ప్రారంభమైందని నా భావన' అని అబ్దుల్లా చెప్పారు.
రక్షణ దళాలలో స్థానిక యువజనులను ఎంపిక చేసేందుకు కార్యక్రమం చేపట్టాలని, ఇందుకోసం రాష్ట్రంలో, ముఖ్యంగా దూర ప్రాంతాలలో రిక్రూట్ మెంట్ ర్యాలీలను తరచు నిర్వహించాలని అబ్దుల్లా కోరారు. రాష్ట్రంలో అభివృద్ధి కార్యక్రమాలను కొనసాగించవలసిన అవసరం ఉందని ఆయన చెప్పారు.
Pages: -1- -2- 3 News Posted: 13 January, 2010
|