మురికివాడల్లో కుబేరులు!? గత కొన్ని సంవత్సరాలుగా నవీ ముంబయిలో దాదాపు లక్షా యాభై వేల లగ్జరీ కార్ల రిజిస్ట్రేషన్ జరిగిందని, వారిలో చాలా మంది సెస్ చెల్లించలేదని తెలియడంతో గత యేడాది సెప్టెంబర్ నెలలో ప్రత్యేక డ్రైవ్ ను ప్రారంభించామని మున్సిపల్ కమిషనర్ మహావీర్ పెంథారీ చెప్పారు. వీటిలో అరకోటి రూపాయలకు పైగా ఖరీదైన కార్లను కొన్నవారిని ముందుగా గుర్తించాం. 25 మంది ప్రముఖులతో పాటు అందరికీ నోటీసులు జారీ చేశామని ఆయన వివరించారు. ఈ జాబితాలో సచిన్, అనిల్ అంబానీ, మహదేవన్, పాటిల్ ఉన్నారని ఆయన ధృవీకరించారు.
అంతేకాదు నవీ ముంబయిని అభివృద్ధి చేయడానికి ఏర్పాటైన నగర, పారిశ్రామిక అభివృద్ధి సంస్థ సైతం ఎగవేతదారుల్లో ఉందని ఆయన పేర్కొన్నారు. రికార్డులు పరిశీలిస్తున్నప్పుడు ఈ ఖరీదైన కారు యజమానులు, కొన్ని సంస్థలు మురికివాడల చిరునామాలు ఇచ్చినట్లు తెలుసుకుని తాము ఆశ్చర్యపోయామని ఆయన వివరించారు. సెస్ ను ఎగ్గొట్టానికే ఈ కుబేరులు తప్పుడు చిరునామాలు ఇచ్చారని, వారి అసలు చిరునామాలను కనుగొనే ప్రయత్నం ప్రారంభించామని ఆయన తెలిపారు. ఈ కేటగిరీలో దాదాపు వంద కార్ల వరకూ ఉన్నాయని ఆయన చెప్పారు.
గత కొన్ని వారాలుగా కార్పోరేషన్ కారు సెస్ ఎగవేతదారుల నుంచి సుమారు ఏడు కోట్ల రూపాయలను వసూలు చేసిందని వివరించారు. నోటీసు అందుకున్న డివై పాటిల్ తాను బకాయిపడ్డ సెస్ ను చెల్లిస్తానంటూ లిఖితపూర్వకంగా తెలియచేశారని, మిగిలిన ప్రముఖులు కూడా పాటిల్ ను ఆదర్శంగా తీసుకుంటారనే తాము భావిస్తున్నామని మహావీర్ అన్నారు.
Pages: -1- 2 -3- News Posted: 25 January, 2010
|