మురికివాడల్లో కుబేరులు!? కారు యజమానులతో పాటు వాటిని అమ్మిన డీలర్లకు కూడా నోటీసులు ఇచ్చామని, ఈ ఎగవేతలో వారే ప్రధాన పాత్రదారులని మహావీర్ చెప్పారు. వారిపై ఇప్పటికే విచారణ చేపట్టామని, వారు సెస్ మొత్తంపై ఐదు రెట్లు నగదును మున్సిపాలిటీకి చెల్లించాల్సి ఉంటుందని వివరించారు. సెస్ ఎగవేసిన కార్లలో అగ్రస్థానం మెర్సిడీస్ బెంజ్ కే దక్కుతుంది. మొత్తం 233 బెంజ్ కార్ల యజమానులు సెస్ చెల్లించలేదని, అలానే 122 బిఎండబ్ల్యు, 37 ఆడీ, 69 కామ్రీ కార్లు కూడా ఈ జాబితాలో ఉన్నాయన్నారు.
తరువాతి దశలో మొత్తం లక్షన్నర రిజిస్ట్రేషన్లను పరిశీలిస్తామని, వీరిలో ఎగవేతదారులను గుర్తించి సెస్ వసూలు చేస్తామని మహావీర్ తెలిపారు. ఇకపై ఆర్టీవో కార్యాలయంలోనే మున్సిపల్ సిబ్బందితో కార్యాలయాన్ని ఏర్పాటు చేస్తున్నామని, కారు రిజిస్ట్రేషన్ అయిన వెంటనే అక్కడే సెస్ వసూలు చేసే ఏర్పాటు చేస్తున్నామని ఆయన చెప్పారు.
కాగా మున్సిపల్ అధికారులకు తమవంతు సహాయం అందచేస్తున్నామని రీజినల్ ఆర్టీవో అధికారు భారత్ కలాస్కర్ చెప్పారు. యజమానులు సమర్పించే డాక్యుమెంట్ ను ఆధారం చేసుకునే రిజిస్ట్రేషన్ చేస్తున్నామని, ఇచ్చిన చిరునామా సరైందో? కాదో ధృవీకరించుకోడానికి తమకు తగిన సిబ్బంది లేరని ఆయన వివరించారు.
Pages: -1- -2- 3 News Posted: 25 January, 2010
|