'పద్మ'కు పట్టని మూన్ టీం నాసా వంటి విదేశీ సంస్థలకు సైంటిస్టులు, ఇంజనీర్ల వలసలను అరికట్టి, గతంలో కన్నా మెరుగైన షరతులతో, ఉత్తమ ప్రతిభ ప్రదర్శనకు పారితోషికాలతో వారిని తిరిగి దేశానికి రప్పించాలని ప్రభుత్వం ఆకాంక్షిస్తున్న సమయంలో ఈ వివాదాస్పద నిర్ణయాన్ని తీసుకున్నారు. అయితే, అధికారపూర్వక గుర్తింపును నిషేధించారు కాని. విదేశాలలోని భారత సంతతికి చెందిన, ఘన విజయాలు సాధించిన వారికి పద్మ అవార్డులు ప్రదానం చేస్తూనే ఉన్నారు. ఈ విషయంలో తాము అలక్ష్యానికి గురవుతున్నామని భారతీయ ప్రభుత్వ సంస్థలు భావిస్తున్నాయి.
ఇస్రో చైర్మన్ అయిన జి. మాధవన్ నాయర్ కు, డిఎఇ చైర్మన్ అయిన అనిల్ కాకోద్కర్ కు 2009లో పద్మ విభూషణ్ అవార్డులు ప్రదానం చేశారు. 'చంద్రయానం, భారత - అమెరికా అణు ఇంధన ఒప్పందం కారణంగా ఒక మినహాయింపుగా వారికి అవార్డులు ప్రదానం చేయడమైనది. ఈ సంవత్సరం పద్మ అవార్డులు ప్రకటితమైన పది మంది సైంటిస్టులు లేదా ఇంజనీర్లలో ఒక్కరు కూడా ప్రభుత్వ సంస్థలు వేటితోనూ సంబంధం ఉన్నవారు కారు' అని ఈ అవార్డుల ప్రక్రియ గురించి క్షుణ్ణంగా తెలిసిన సీనియర్ సైంటిస్ట్ ఒకరు పేర్కొన్నారు. చంద్రయాన్ 1 రోదసీ నౌకను ప్రయోగించిన మూడు నెలల తరువాత, 11 వైజ్ఞానిక ప్రయోగ సాధనాలలో అనేకం పని చేయడం ప్రారంభించిన సమయంలోనే మాధవన్ నాయర్ కు అవార్డు ప్రకటించారు.
పద్మ అవార్డు విజేతల పేర్లను సోమవారం సాయంత్రం ప్రకటించినప్పుడు, నిరుడు నాయర్ వలె ఈ సంవత్సరం కూడా మినహాయింపుగా చంద్రయాన్ బృందంలో ఎవరినైనా సత్కరిస్తున్నారా అని ఇస్రో అధికారులు ఆ పేర్లను క్షుణ్ణంగా పరిశీలించారు. 'ఇది నిజంగా నిరాశాజనకం. చంద్రయాన్ దేశానికి గర్వకారణమైన తరువాత కనీసం ఈ ప్రాజెక్టు డైరెక్టర్ మయిల్ స్వామి అణ్ణాదురైకి అవార్డు ప్రకటిస్తారని మేము భావించాం. కాని చివరకు ఆయనను కూడా నిర్లక్ష్యం చేశారు. చంద్రయాన్ ప్రాజెక్టును దేశానికి బ్రాండ్ అంబాసడర్ గా పరిగణించారు' అని ఇస్రో సీనియర్ అధికారి ఒకరు చెప్పారు.
Pages: -1- 2 -3- News Posted: 29 January, 2010
|