'పద్మ'కు పట్టని మూన్ టీం మూన్ సొసైటీ భారత శాఖ కార్యదర్శి ప్రదీప్ మోహన్ దాస్ ఈ విషయమై మాట్లాడుతూ, 'ఇంజనీరింగ్, మేనేజ్ మెంట్ విజయానికి పలు జాతీయ, అంతర్జాతీయ వేదికల నుంచి బహుధా ప్రశంసలు చూరగొన్న చంద్రయాన్ 1 బృందానికి పద్మ అవార్డు ప్రకటించకపోవడం నిరాశ కలిగించింది. భారతదేశ వైజ్ఞానిక, సాంకేతిక ప్రాదుష్యాన్ని ప్రపంచానికి చాటిచెప్పిన ప్రాజెక్టు కూడా ఇదే' అని పేర్కొన్నారు.
ఈ సంవత్సరం పది మంది సైంటిస్టులకు పద్మ అవార్డులు ప్రకటించారు. వారిలో ఒకరు నోబెల్ బహుమతి విజేత వెంకటరామన్ రామకృష్ణన్. ప్రపంచంలో అత్యున్నత పురస్కారాన్ని పొందుతున్న తరువాత ఆయనకు ఎందుకు పద్మ విభూషణ్ అవార్డు ప్రకటించారని వైజ్ఞానిక వర్గాలు ప్రశ్నించాయి. 'మిగిలిన తొమ్మిది మంది సైంటిస్టులు ప్రభుత్వ సంస్థలలో రిటైరైనవారు లేదా విశ్వవిద్యాలయాలలో పని చేస్తున్నవారు అయ్యారు. మరొక పక్క ప్రధానికి గుండెకు బైపాస్ సర్జరీ చేసిన డాక్టర్ కు పద్మ అవార్డు ప్రకటించారు' అని సైంటిస్ట్ ఒకరు పేర్కొన్నారు.
Pages: -1- -2- 3 News Posted: 29 January, 2010
|