అమానుష హత్యల క్రీడ సుమారు 60 గంటలు...మూడు రోజులు గడిచిన తరువాత అంటే సోమవారం సాయంత్రం ఏడు గంటల సమయంలో గుండె పగిలే వార్త. పసిమొగ్గ వైష్ణవిని కిరాతకులు అత్యంత కర్కశంగా హత్య చేసారన్న నిజం బయట పడింది. విజయవాడలో మాయమైన చిన్నారి గుంటూరులో బూడిదగా మారిందన్న వార్త యావత్తూ ఆంధ్ర జనం గుండెలను పిండేసింది. తాను అల్లారు ముద్దుగా పెంచుకున్న చిన్నారి ఇనుప కొలిమిలో మాడి మసియిందని తెలియగానే ఆ తండ్రి గుండె జారింది. నిలువునా కుప్పకూలిపోయాడు. జనవరి 2 మంగళవారం తెల్లవారగానే మరో దుర్వార్త. తనకు ఇష్టమైన, ఆరో ప్రాణమైన కుమార్తె ఎముకల మాత్రమే మిగలడాన్ని తట్టుకోలేక ఆ తండ్రి తనకున్న పంచప్రాణాలను వదిలాడని వైద్యుల ప్రకటన.
మూడు రోజుల ఉదంతంలో ముగ్గురి ప్రాణాలను పొట్టనపెట్టుకోవడం వెనుక ఏవేం కారాణాలున్నాయనే ప్రశ్నలు అందరినీ తొలుస్తున్నాయి. విజయవాడకి చెందిన పలగాని ప్రభాకర్ రెండు పెళ్లిళ్లు చేసుకున్నాడు. తొలి భార్య వెంకటేశ్వరమ్మకు ఒక అబ్బాయి సంతానం. ఆ తరువాత ప్రభాకర్ నర్మదేశ్వరిని వివాహం చేసుకున్నాడు. ఈ భార్యకు ఇద్దరు సంతానం. వీరే నాగ వైష్ణవి, సాయి తేజేష్ లు. ఇంతవరకు బాగానే ఉంది. వైష్ణవి పుట్టన తరువాత ప్రభాకర్ కోట్ల రూపాయలకు పడగలెత్తాడు. అయితే ప్రభాకర్ లిక్కర్ వ్యాపారాలతో భారీగా సంపదను ఆర్జించాడు. డబ్బు సంపాదించడమే ఆయన కుటుంబం పాలిట శాపమైంది. కుటుంబాల్లో చిచ్చు రగిల్చింది. ఆస్తులన్నింటిలో సగం తన అల్లారుముద్దుగా పెంచుకున్న వైష్ణవి పేరిట ప్రభాకర్ రాస్తున్నట్లు ఆయన తొలి భార్య తమ్ముడు వెంకట్రావ్ భావించాడు. అంతకుముందు ఇద్దరు కలసి చేసిన వ్యాపార లావాదేవీల్లో మనస్పర్థలు ఉండటంతో వెంకట్రావ్ పథకం రచించాడు.
తన పిన్ని కొడుకు శ్రీనివాస రావుతో కలసి వైష్ణవిని హతమార్చేందుకు వ్యూహం రచించాడు. 50 లక్షల కిరాయికి రెండు నరహంతకుల ముఠాలను రంగంలోకి దించాడు. జనవరి 30 శనివారం నాడు విజయవాడలో ప్రభాకర్ పిల్లలు వైష్ణవి , సాయి తేజేష్ లు స్కూలుకు వెళుతున్న సమయాన్ని ఆసరగా చేసుకొని పయనిస్తున్న కారును ఒక ముఠా అడ్డగించింది. అడ్డువచ్చిన కారు డ్రైవర్ ను అక్కడిక్కడే హత్య చేసారు. వైష్ణవిని ఎత్తుకెళ్లారు. ముందస్తు వ్యూహం ప్రకారం కారులు మార్చారు. గుంటూరుకు చేరుతుండగానే చిన్నారిని అత్యంత కర్కశంగా గొంతు నులిమి చంపేశారు. అంతటితో ఆ పగ చల్లారలేదు. గుంటూరు శివారు ప్రాంతంలోని నిర్జీవమైన ప్రాంతంలో తన పిన్ని కొడుకు శ్రీనివాస రావుతో కలసి ఆచూకీని కూడా దొకరనీయకుండా ఇనుప కొలిమిలో వైష్ణవి మృత దేహాన్ని దగ్థం చేసారు. శవమంతా కాలి బూడిద కాగా, ఎముకలు మాత్రం మిగిలాయి.
Pages: -1- 2 -3- News Posted: 2 February, 2010
|