అధికారుల చేతుల్లో మంత్రులు తుది రిపోర్ట్ కార్డులు ప్రతి సంవత్సరం మే ఒకటో తేదీకల్లా వెలువడుతాయి. వీటిని మంత్రివర్గం ముందు ఉంచుతారు. అయితే, ఏడాది మధ్యలో సమీక్షకు కూడా అవకాశం ఉంది. క్యాబినెట్ కార్యదర్శి, ఆర్థిక శాఖ కార్యదర్శి, వ్యయ విభాగం కార్యదర్శి, ప్రణాళికా సంఘం, పిఎండి, సంబంధిత విభాగం కార్యదర్శులు ఈ సమీక్షలు జరుపుతారు.
చాలా మంది క్యాబినెట్ మంత్రులకు అటువంటి ఒక 'ఎంఒయు'పై తాము సంతకం చేశామనే సంగతి కూడా తెలియదు. పని తీరు మదింపునకు సంబంధించిన ఏదో పత్రంపై తాము సంతకాలు చేశామని మాత్రమే వారికి జ్ఞాపకం. ఈ పత్రాన్ని శ్రద్ధతో చదివిన సీనియర్ క్యాబినెట్ మంత్రి ఒకరు సంతకం చేయడానికి తొలుత నిరాకరించారు. కాని ప్రధాని కార్యాలయం (పిఎంఒ) 'వివరించిన' తరువాత సంతకానికి ఆయన మొగ్గారు.
చాలా మంది మంత్రులు ఆంతరంగికంగా ఫిర్యాదు చేస్తున్నారు. అమెరికా సాకునే ఇందుకు వారు పేర్కొంటున్నారు. 'అమెరికన్ అధ్యక్ష తరహా పాలనను ప్రవేశపెట్టకుండా అమెరికన్ విధానాన్ని అనుసరించాలని అనుకోవడం చేటనే సంగతి ప్రధాని తెలుసుకోవాలి. లక్ష్యాలను నిర్దేశించడం, స్కోర్లు ఇవ్వడం అనే సూత్రం పూర్తిగా అనవసరం' అని ఒక మంత్రి వ్యాఖ్యానించారు. 'సంతకానికి మేమంతా నిరాకరించి ఉండవలసింది. కాని పిఎంఒ తెలివిగా మొదటి సంతకందారుల జాబితాలో నాలుగు భారీ శాఖలను (ఆర్థిక, హోమ్, రక్షణ, విదేశాంగ మంత్రిత్వశాఖలను) మినహాయించింది. ఇతరులకు నిరసించే ధైర్యం లేకపోయింది' అని మరొక మంత్రి పేర్కొన్నారు. అయితే, చివరకు అన్ని మంత్రిత్వశాఖలకు ఈ మదింపు విధానం వర్తింపచేయనున్నట్లు అధికార వర్గాలు తెలియజేశాయి.
అయితే, పని చేయని మంత్రులను నిలదీయడానికి ఇటువంటి వ్యవస్థీకృత పని తీరు సమీక్ష యంత్రాంగం అవసరమని కొందరు మంత్రులు అంగీకరించారు. ఈ మంత్రులు ప్రధానంగా మిత్ర పక్షాలకు చెందినవారని వారు పేర్కొన్నారు. ఐక్య ప్రగతిశీల కూటమి (యుపిఎ) మొదటి హయాంలో డిఎంకె మంత్రుల పట్ల ప్రధాని తీవ్ర అసంతృప్తి ప్రకటిస్తుండేవారు.
Pages: -1- 2 -3- News Posted: 2 February, 2010
|