అధికారుల చేతుల్లో మంత్రులు అయితే, 'ప్రధాన కార్యక్రమాలు, కొత్త పథకాలు, ప్రతీక వంటి ప్రాజెక్టుల' అమలు పర్యవేక్షణకు తన కార్యాలయంలోనే 'ఫలితాల పర్యవేక్షణ విభాగం' ఒకదానిని ప్రధాని ఇప్పటికే ఏర్పాటు చేసినందున ఈ ఆర్ఎఫ్ డి అనవసరమని కీలక మిత్రపక్షానికి చెందిన సీనియర్ నాయకుడు ఒకరు వాదించారు. 'పని తక్కువ, సమీక్ష ఎక్కువ అనే క్లాసిక్ ఉదంతంగా ఇది మారుతోంది. మంత్రులు, అధికారులు గ్రేడింగ్ గురించి ఆందోళన చెందుతున్నారు. తప్పుడు లక్ష్యాలు నిర్దేశిస్తున్నారు. వారు కల్పిత నివేదికలు ఇవ్వడం తథ్యం. సామర్థ్యం మెరుగుదలకు ఇంకా ఉత్తమ మార్గాలు ఉన్నాయని మా భావన' అని ఆయన పేర్కొన్నారు.
ఆర్ఎఫ్ డిని ప్రవేశపెట్టడంలో ఉద్దేశం మంత్రులను ఇబ్బంది పెట్టడం కాదని, పని సంస్కృతిలో మార్పు తీసుకువచ్చి ప్రక్రియకు ప్రాముఖ్యం ఇవ్వడం నుంచి ఫలితాలకు ప్రాధాన్యం ఇచ్చేట్లు చూడడమేనని క్యాబినెట్ సెక్రటేరియట్ లోని పిఎండి అధికారులు వివరించారు. నిరుడు మే నెలలో ప్రధానిగా రెండవ సారి బాధ్యతలు స్వీకరిస్తూ డాక్టర్ మన్మోహన్ సింగ్ మంత్రిత్వశాఖల పని తీరును నిరంతరం పర్యవేక్షించనున్నట్లు చెప్పారు. ప్రతి మంత్రిత్వశాఖ ఎన్నికల వాగ్దానాలను అమలు పరిచేట్లు చూసేందుకై ప్రతి మూడు నెలలకు సమీక్షలు జరపాలని ఆయన సూచించారు.
అదే సమయంలో పార్లమెంట్ ఉభయ సభలను ఉద్దేశించి చేసిన ప్రసంగంలో కూడా రాష్ట్రపతి పని తీరు మెరుగుదల, జవాబుదారీతనం గురించి నొక్కి చెప్పారు. చివరకు పాలనా సంస్కరణల కమిషన్ (ఎఆర్ సి) కూడా పని తీరు సమీక్షించాలనే సూచన చేసింది. అంతర్జాతీయంగా అనుసరిస్తున్న ఉత్తమ పద్ధతులను సమగ్రంగా అధ్యయనం చేసిన మీదటే ఆర్ఎఫ్ డికి రూపకల్పన చేసినట్లు పిఎండి తెలియజేసింది. ఒక కార్యదర్శి సారథ్యం వహించే ఈ డివిజన్ మంత్రిత్వశాఖల అధికారులకు శిక్షణ కూడా ఇస్తుంది. ఒక ఆర్థిక సంవత్సరంలో ఒక మంత్రిత్వశాఖ నిర్వర్తించవలసిన అత్యంత ముఖ్యమైన బాధ్యతల సమాచారంతో పాటు 5 నుంచి 10 సంవత్సరాలకు ఒక వ్యూహాత్మక ప్రణాళికను కూడా ఆర్ఎఫ్ డి సమకూరుస్తుంది.
Pages: -1- -2- 3 News Posted: 2 February, 2010
|