వైష్ణవి బలైంది ఎందుకు? మరి దేశంలోని పలు ఇతర ప్రాంతాలలో రెండవ భార్య లేదా వివాహేతర సంబంధం వల్ల కాపురాలు కుప్పకూలుతున్న స్థితిలో ఆంధ్ర ప్రదేశ్ లోనే ఇలా ఎందుకు జరుగుతోంది? సోషియాలజిస్ట్ ఎం. భరత్ భూషణ్ ఇందుకు రెండు కారణాలు చెబుతున్నారు. రాష్ట్రంలో చట్టాన్ని ఏమాత్రం ఖాతరు చేయకపోవడం ఒక కారణం కాగా డబ్బును భగవంతునిలా కొలవడం రెండవ కారణమని ఆయన పేర్కొన్నారు. 'ఒక వ్యక్తికి డబ్బు ఉంటే అతను మరొక భార్య కోసం చూస్తున్నాడు. చివరకు ప్రముఖులు కూడా అలాంటి రెండవ వివాహానికి హాజరవుతారు' అని ఆయన చెప్పారు. 'ఆవిడా మా ఆవిడే', 'నారి నారి నడుమ మురారి', 'ఇంట్లో ఇల్లాలు వంటింట్లో ప్రియురాలు' వంటి తెలుగు చిత్రాలు అనేకం ఇందుకు ప్రేరణ ఇస్తున్నాయని, వీటిలో రెండు పెళ్లిళ్ల పద్ధతిని ఘనంగా చూపారని ఆయన ఆరోపించారు. హైదరాబాద్ కు చెందిన ప్రముఖ వివాహ సంబంధాల సంస్థ అధినేత్రి పి. వనజారావు ఈ విషయమై మాట్లాడుతూ, రాష్ట్రంలో ప్రజలు సంపదను పెంచుకుంటున్నా, వారి భావజాలం ఇంకా భూస్వామ్య లక్షణాలనే ప్రతిబింబిస్తోందని అన్నారు. 'డబ్బు... వారి ఆలోచనా సరళిని మార్చలేదు' అని ఆమె పేర్కొన్నారు.
ప్రభాకర్ సుమారు 15 సంవత్సరాల క్రితం నర్మదను వివాహం చేసుకున్నప్పుడు ఆయనకు అంతకుముందే వెంకటేశ్వరమ్మతో పెళ్లి అయిందనే సంగతి నర్మద కుటుంబానికి తెలుసు. 'చిన్నిల్లు' సంప్రదాయానికి తగినట్లుగానే ప్రభాకర్ తన రెండవ భార్యతో అయోధ్యనగర్ లో నివసిస్తూనే తన మొదటి భార్య కోసం విజయవాడ పటమట లంకలో ఒక ఇల్లు నిర్మించి, ఆమెకు నెల నెలా రూ. 50 వేలు పంపుతుండేవారు. నర్మదను ప్రభాకర్ వివాహం చేసుకున్నప్పుడు వెంకటేశ్వరమ్మకు సంతానం లేదు. (పురుషులు రెండవ వివాహం చేసుకోవడానికి సాధారణంగా చెప్పే కారణం ఇదే కదా.) చాలా సందర్భాలలో నర్మద వలె రెండవ భార్యకు చట్టబద్ధమైన వివాహితకు ఉండే హోదా, గౌరవం లభిస్తుంటాయి.
Pages: -1- 2 -3- News Posted: 3 February, 2010
|