వైష్ణవి బలైంది ఎందుకు? రాష్ట్రంలో, ముఖ్యంగా రాయలసీమ, తెలంగాణ ప్రాంతాలలో బహుభార్యాత్వం జానపద కథలలో మాత్రమే ప్రతిబింబిస్తుంటుందని ప్రొఫెసర్ కె. సీతారామ్ చెప్పారు. 'మల్లన్న కథలలో భగవంతుడు మల్లన్న ఐదుగురు మహిళలను వివాహం చేసుకున్నాడు. కొండ కథలలో భగవంతుడు వెంకన్న ముగ్గురు మహిళలను పెళ్లి చేసుకున్నాడు' అని ఆయన చెప్పారు. వరంగల్లులో కాకతీయ వంశస్థుల పాలనలో యుద్ధాలలో అనేక మంది పురుషులు హతులయ్యారు. 'ఇద్దరు ముగ్గురు భార్యలను కలిగి ఉండడం మగవానికి సహజమైపోయింది' అని ఆయన వివరించారు.
రాయలసీమలో పలువురు భూస్వాములు బహుభార్యాత్వం పద్ధతిని పాటించేవారు. ఇది ఒక విధంగా ప్రయోజనదాయకం కూడా. 'రాయలసీమ, తెలంగాణ మెట్ట ప్రాంతాలలో వ్యక్తులకు విస్తారంగా భూములు ఉండడం పరిపాటి. ప్రతిష్ఠ కోసం వారు ఇద్దరిని, ఒక్కొక్కసారి ముగ్గురిని వివాహం చేసుకుంటుంటారు. వారు వేర్వేరు భార్యల పేరిట ఆ భూములను పంచుతుంటారు. దాని వల్ల వారి సంపద కుటుంబ సభ్యుల అధీనంలోనే ఉంటుంది. భూ గరిష్ఠ పరిమితి చట్టం పరిధిలోకి రాకుండా తప్పించుకోవచ్చు' అని సీతారామ్ వివరించారు.
బహుభార్యాత్వాన్ని సామాజికంగా అంగీకరిస్తున్నప్పుడు చట్టంతో దీనిని అరికట్ట లేరని పౌర హక్కుల నాయకురాలు వసంత కన్నభిరాన్ అన్నారు. 'రహస్యంగా రెండు కాపురాలు సాగించడానికి మించి, సంపద పంచుకోవడంపై తలెత్తిన వివాదమే నాగ వైష్ణవి హత్యకు, ఆ కారణంగా ఆమె తండ్రి ప్రభాకర్ మృతికి దారితీసినట్లు తేలుతున్నది' అని ఆమె అన్నారు.
Pages: -1- -2- 3 News Posted: 3 February, 2010
|