రిక్షాతో అమెరికాకు!
సమ్మాన్ సాయం లభించిన ఒక రిక్షా పుల్లర్ భార్య లీలా దేవి (37) ఈ సందర్భంగా మాట్లాడుతూ, తన భర్త రోజు సంపాదన రూ. 40, 50 నుంచి రూ. 250, రూ. 300 మధ్య స్థాయికి పెరిగిందని తెలియజేసింది. 'గతంలో మా భోజనానికి కూడా మా వద్ద తగినంత డబ్బు ఉండేది కాదు. కాని ఇప్పుడు మేము మా ముగ్గురు పిల్లలను స్కూలుకు పంపగలం' అని ఆమె చెప్పింది. తమ వాహనాల మారిన రూపు ధర్మమా అని తాను, ఇతర పుల్లర్లు చివరకు విమానాశ్రయం నుంచి కూడా సర్వీసులు నిర్వహించగలుగుతున్నామని, ఆసక్తిపరులైన ప్రయాణికులను నగరంలోకి తమ రిక్షాలలో తీసుకువస్తున్నామని ఒక రిక్షా పుల్లర్ చెప్పాడు. 'దీని వల్ల మాకు ఆదాయం పెరగడంతో పాటు మర్యాద కూడా లభిస్తున్నది. విమానాశ్రయం నుంచి వచ్చే కస్టమర్లు మాకు టీ ఆఫర్ చేస్తున్నారు. మాతో మర్యాదగా మాట్లాడుతున్నారు' అని అతను తెలిపాడు.
'దేశవ్యాప్తంగా కోటి మంది రిక్షా పుల్లర్లు ఉండడం, వారు రిక్షా యజమానులకు రూ. 30 నుంచి రూ. 35 వరకు చెల్లిస్తుండడం, కాని రోడ్లపై తాము పడిన శ్రమకు నామమాత్రపు ఫలితం పొందుతుండడం గమనించి నేను వారితో కలసి ఈ రిక్షాలకు రూపకల్పన చేశాను' అని ఇర్ఫాన్ తెలియజేశారు. రిక్షా పుల్లర్లు ఈ వాహనాలకు యజమానులు కావాలని ఆయన నిర్ణయించుకున్నారు. తన ఐఐఎం అర్హతలను ఉపయోగించి తాను వారికి రుణాలు ఇచ్చేట్లుగా బ్యాంకులను ఒప్పించానని, వారు ఆ రుణాలతో రూపుమారిన రిక్షాలను కొన్నారని ఆయన తెలిపారు.
Pages: -1- 2 -3- News Posted: 6 February, 2010
|