రిక్షాతో అమెరికాకు! 'రిక్షా పుల్లర్ల వద్ద గుర్తింపు పత్రాలు, బ్యాంకు అకౌంట్లు లేదా పాన్ కార్డులు లేనందున బ్యాంకులకు నచ్చజెప్పడానికి నానా తంటాలు పడవలసివచ్చింది' అని ఐఐఎంకు వెళ్ళే ముందు ఉత్తర బీహార్ బేగుసరాయిలోని ఒక గ్రామీణ కాలేజీలో పట్టభద్రుడైన ఇర్ఫాన్ చెప్పారు. 'ఇప్పుడు దేశవ్యాప్తంగా సమ్మాన్ ఫౌండేషన్ తో అనుబంధం ఉన్న రిక్షాపుల్లర్లు మూడు లక్షల మంది ఉన్నారు' అని ఆయన తెలిపారు. వ్యాపారపరమైన చొరవ, నైపుణ్యాలతో ప్రపంచమంతటా పేదరికాన్ని నిర్మూలించవచ్చునన్న సందేశం ప్రచారం చేయడానికి ప్రధానంగా శోధకులైన ముస్లిం పారిశ్రామిక, వ్యాపారవేత్లల కోసం ఈ సదస్సును ఒబామా ఏర్పాటు చేశారని రోమర్ వివరించారు. ఫౌండేషన్ తాను కార్యకలాపాలు సాగిస్తున్న రాష్ట్రాలలో రిక్షా పుల్లర్లకు చౌకగా ఇళ్ళు లభించేట్లు చూడాలని, వారి వారి ప్రాంతాలలో విద్య, వినోద సౌకర్యాలు కల్పించాలని యోచిస్తున్నట్లు కూడా ఇర్ఫాన్ తెలియజేశారు.
భారతదేశంలోని అమెరికా రాయబారి తిమోతి జె. రోమర్ శుక్రవారం పాట్నాను సందర్శించినప్పుడు ఒబామా ఆహ్వానించిన విషయాన్ని ధ్రువీకరించారు. తన భార్య షెల్లీతో కలసి సమ్మాన్ ఫౌండేషన్ కార్యాలయాన్ని సందర్శించిన రోమర్ ఇంకా మాట్లాడుతూ, 'ఇర్ఫాన్ ఒక విశిష్ట బిజినెస్ మోడల్. ఇండియా రూపురేఖలను, ముఖ్యంగా బీహార్ రూపురేఖలను ఇది మార్చగలదని నా విశ్వాసం' అని చెప్పారు. రోమర్ శుక్రవారం ఒక రిక్షా పుల్లర్ సీటుపై కూర్చుని కొంత సేపు రిక్షా తొక్కారు. ఆ రిక్షాలో ఇర్ఫాన్ తల్లిదండ్రులు హెషముద్దీన్, మేము నిషా ప్రయాణికులుగా కూర్చున్నారు. 'ఇర్ఫాన్, ఆయన తల్లిదండ్రులు మహోన్నతులు' అని అమెరికా రాయబారి పేర్కొన్నారు. 'రిక్షా తొక్కి చూడడానికి నాకు ఇది ఒక చక్కని అవకాశం కూడా' అని రోమర్ చెప్పారు.
Pages: -1- -2- 3 News Posted: 6 February, 2010
|