ఇం'ధన'మ్ కంపెనీల ఇష్టం
ఈ చేదు మాత్ర మింగించడానికి ప్రభుత్వానికి ఇదే సరైన సమయమని ప్రభుత్వంలో ఒక బలమైన వర్గం వాదిస్తున్నది. ఈ సంవత్సరం ఎన్నికలు జరగవలసి ఉన్న రాష్ట్రం బీహార్ ఒక్కటే. అక్కడ కూడా ఎన్నికలు అక్టోబర్ లో మాత్రమే జరుగుతాయి కనుక ఈ పెంపునకు ఇప్పుడు అవకాశం ఉందని ఆ వర్గం అంటున్నది. కాగా, ఇంధన సబ్సిడీ దుర్భరంగా తయారైందనే వాదనను కాంగ్రెస్ అంగీకరించిందనే సూచనలు కూడా కనిపిస్తున్నాయి. అయితే, ఆహార ద్రవ్యోల్బణం సుమారు 17 శాతంగా ఉన్న సమయంలో ధైర్యంగా పార్టీ ఈ చర్య తీసుకుంటుందా అనేది వేచి చూడవలసి ఉంటుంది.
పెట్రోలియం ధరలపై ప్రభుత్వ నియంత్రణను తొలగించాలని మంత్రిత్వశాఖ వాదిస్తూనే, అసాధారణ పరిస్థితులలో వినియోగదారునికి ఉపశమనం కలిగించేందుకు తాను ఎప్పుడూ జోక్యం చేసుకోగలనని నొక్కి చెబుతున్నది. ద్రవ్యోల్బణంపై ఇంధన ధర హెచ్చింపు ప్రభావం నామమాత్రంగా ఉంటుందని చెప్పేందుకు ఆయిల్ మంత్రిత్వశాఖ రెండు ప్రతిపాదనలు చేసింది. వాటిలో ఒక ప్రతిపాదన, పెట్రోలు, డీజెల్ ధరలను లీటర్ కు రూపాయి పెంచడం. పెట్రోలు ధరలను మాత్రమే లీటర్ కు రూ 3 మేర పెంచాలనేది రెండవ ప్రతిపాదన. 4.78 శాతంగా ఉన్న నవంబర్ ద్రవ్యోల్బణ సూచిని కొలబద్దగా తీసుకుంటే మొదటి ప్రతిపాదన వల్ల ద్రవ్యోల్బణం స్వల్పంగా 4.93 శాతానికి పెరుగుతుంది. రెండవ ప్రతిపాదన వల్ల ద్రవ్యోల్బణం 4.85 శాతానికి పెరుగుతుంది.
డీజెల్ పై సబ్సిడీ దుర్వినియోగం అవుతోందనే ఆందోళన వల్ల ఈ సౌకర్యాన్ని వ్యవసాయ రంగానికి మాత్రమే పరిమితం చేయాలని మంత్రిత్వశాఖ ఆలోచిస్తున్నట్లు ఆ వర్గాలు తెలిపాయి. డీజెల్ మోటారు వాహనాలు వాడే కోట్లాది మంది మార్కెట్ రేట్లను చెల్లించకపోతున్న ఈ విధానానికి ఈవిధంగా స్వస్తి చెప్పవచ్చునని మంత్రిత్వశాఖ భావిస్తున్నది. 'ఎవరికైతే ఉద్దేశించారో వారికే సబ్సిడీ దక్కాలి' అని మంత్రిత్వశాఖలో ఒక సీనియర్ ప్రతినిధి స్పష్టం చేశారు. అంటే ఇది రెండు ధరల పద్ధతికి దారి తీస్తుంది. పీలియన్ వాహనదారుల నుంచి అసలు సిసలు లబ్ధిదారులను వేరు చేసేందుకు స్మార్ట్ కార్డులను ఉపయోగించాలనే ప్రతిపాదనపై చర్చ జరుగుతోంది. అయితే, అనర్హులను ఏ విధంగా వేరు చేయాలో మంత్రిత్వశాఖ తేల్చుకోలేకపోతున్నది.
Pages: -1- -2- 3 News Posted: 10 February, 2010
|