ఇం'ధన'మ్ కంపెనీల ఇష్టం
కాంగ్రెస్ అధిష్టాన వర్గం అభిప్రాయాలతో పెట్రోలియం శాఖ మంత్రి మురళీదేవరా ఏకీభవిస్తూ వంట గ్యాస్, కిరోసిన్ ధరల జోలికి పోవద్దని తన మంత్రిత్వశాఖను కోరినట్లు అధికార వర్గాలు తెలియజేశాయి. వీటిని ఏమాత్రం పెంచినా ద్రవ్యోల్బణాన్ని ప్రభావితం చేస్తాయని ఆయన సూచించారు. ఏమైనా వంట గ్యాస్, కిరోసిన్ ధరలను పెంచరాదన్న ప్రతిపాదనకు ఆమోదముద్ర లభించవచ్చు. శనివారం జరిగిన ముఖ్యమంత్రుల సమావేశంలో ఈ మేరకు సూచనలు వచ్చాయి. సామాన్యులు వాడే ఇంధనాల ధరలను ఎటువంటి పరిస్థితిలోను పెంచరాదని ఆ సమావేశంలో వివిధ పార్టీల ప్రభుత్వాల అధినేతలు ముక్తకంఠంతో కోరారు.
మంత్రివర్గానికి సమర్పించేందుకు తన మంత్రిత్వశాఖ రూపొందిస్తున్న ప్రతిపాదన గురించి మాట్లాడేందుకు దేవరా నిరాకరించారు. పారిఖ్ బృందం నివేదిక అందిన తరువాత తన మంత్రిత్వశాఖ సిఫార్సులతో పాటు ఆ నివేదికను మంత్రిత్వశాఖ ముందు ఉంచడానికి ఆయిల్ మంత్రి ఒక వారం గడువు నిర్దేశించారు. ఇంధన సబ్సిడీ ఖజానాకు తలకు మించిన భారంగా మారినందున ప్రస్తుత ధరల యంత్రాంగాన్ని కొనసాగించజాలమని అంతర్గత చర్చలలో దేవరా స్పష్టం చేశారని మంత్రిత్వశాఖ అధికారులు తెలియజేశారు. ప్రయోగానికి ప్రయత్నించేందుకు ఇదే అత్యుత్తమ సమయమని పారిఖ్ కమిటీ సిఫార్సులపై చర్చించేందుకు ఏర్పాటు చేసిన సమావేశంలో చెప్పినట్లు అధికారి ఒకరు తెలిపారు.
ప్రభుత్వ రంగంలోని ఆయిల్ మార్కెటింగ్ సంస్థలు 2009 - 2010 సంవత్సరంలో తమ ఇంధన విక్రయాలపై సుమారు రూ. 40 వేల కోట్లు నష్టపోవచ్చునని భావిస్తున్నారు. అంతర్జాతీయ క్రూడాయిల్ ధరకు అనుగుణంగా బంకులలో ధరలు హెచ్చించేందుకు ప్రభుత్వం అనుమతించకపోవడం ఇందుకు కారణం. ఈ నష్టంలో కొంత భాగాన్ని దేశీయ ఆయిల్ ఉత్పత్తుల నుంచి డిస్కౌంట్లతోను, కేంద్రం నుంచి కొంత నగదు సహాయంతోను భర్తీ చేస్తన్నారు. అయితే, ఇది చాలడం లేదు. ఈ సంస్థల పెరిగిపోతున్న నష్టాలలో ఇది ప్రతిబింబిస్తున్నది.
Pages: -1- 2 -3- News Posted: 10 February, 2010
|