'ద్వంద్వ' ఆరాటం వారిలో అనేక మంది తమ గ్రాడ్యుయేట్ డిగ్రీ సర్టిఫికెట్లను గాని, పిహెచ్ డి డిగ్రీల ప్రూఫ్ ను గాని వెంటనే చూపించగలరు. కాని వారు 1950 దశకంలో, ఇంకా ముందు జారీ అయిన సెకండరీ స్కూల్ లీవింగ్ సర్టిఫికెట్ (ఎస్ఎస్ఎల్ సి)లు ఎక్కడ ఉన్నాయో కనిపెట్టలేకపోతున్నారు. భారతీయ వీసాల జారీకి కావలసిన పత్రాల జాబితా నార్త్ బ్లాక్ ఇష్టానుసారం దాదాపుగా ఏరోజుకారోజు మారిపోతుండడంతో, భారతీయ అమెరికన్లు వేలాది మంది వీసాలు కోరడం కన్నా ద్వంద్వ పౌరసత్వం కోసం దరఖాస్తు చేయడమే శ్రేయస్కరమని భావిస్తున్నారు. అందుకే ద్వంద్వ పౌరసత్వం కోసం డిమాండ్ ఇబ్బడిముబ్బడిగా పెరిగిపోయింది.
కేంద్రం డిమాండ్లు అంతకంతకు దారుణంగా తయారవుతుండడంతో తమకు చివరకు దేశాన్ని సందర్శించడం అసాధ్యం కావచ్చునని ఇరవై లక్షల పైచిలుకు భారతీయ అమెరికన్లలో అధిక సంఖ్యాకులు భయపడుతున్నారు. వారిలో కొందరు సెంటిమెంట్ తోనో, మరే విధంగానైనా ఇండియాను స్వదేశంగానే ఇప్పటికీ పరిగణిస్తున్నారు. అయితే, ద్వంద్వ పౌరసత్వం సంపాదించడం దీర్ఘకాలం పట్టే, సంక్లిష్టమైన ప్రక్రియ. దీనిలో కేంద్ర హోమ్ మంత్రిత్వశాఖకు కీలక పాత్ర ఉంది. యుఎస్ లోని భారతీయ కాన్సులర్ కేంద్రాలకు ఇది మరిన్ని ఇబ్బందులు కలిగించవచ్చునని భావిస్తున్నారు.
వాషింగ్టన్ లో జన్మించిన, సగం పాకిస్తానీ అయిన హెడ్లీ యుఎస్ లోని భారత కాన్సులర్ అధికారులను ఎందుకూ కొరగాకుండా చేసి ఇండియాకు మల్టిపుల్ ఎంట్రీ వీసా సంపాదించగలిగాడనే బాధ నుంచి కేంద్ర హోమ్ మంత్రిత్వశాఖ తేరుకోలేకపోవడమే ఈ సమస్యకు ప్రధాన కారణమని పేరు వెల్లడించలేని కాన్సులర్ అధికారి ఒకరు చెప్పారు. భారత వ్యతిరేక టెర్రరిస్టులతో సంబంధాలు కలిగి ఉన్నందుకు హెడ్లీ ప్రస్తుతం షికాగోలో జైలులో ఉన్న విషయం విదితమే.
హెడ్లీ వీసా వంటి మామూలు కాన్సులర్ వ్యవహారాలను ఉన్నతాధికారులు సరిగ్గా నిర్వహించలేకపోవడం వల్ల ఇండియాకు ప్రయాణించవలసిన అవసరం నిజంగా ఉన్న భారతీయ అమెరికన్లు, ఇతర యుఎస్ పౌరులు ఇప్పుడు సమస్య ఎదుర్కోవలసి వస్తున్నదని ఆ అధికారి పేర్కొన్నారు. వీసాల కోసం దరఖాస్తు చేసే యుఎస్ లో జన్మించని అమెరికన్లు, భారతీయ అమెరికన్లు కానివారు 'బర్త్ సర్టిఫికెట్ ను గాని, తల్లిదండ్రుల పేరు, జన్మ తేదీ, జాతీయత తెలియజేసే తమ స్వదేశం నుంచి ఏదైనా ప్రభుత్వ డాక్యుమెంట్ ను గాని సమర్పించాలి' అని న్యూఢిల్లీ నుంచి వచ్చిన తాజా ఉత్తర్వు స్పష్టం చేస్తున్నది.
Pages: -1- -2- 3 News Posted: 12 February, 2010
|